మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైలు ప్రమాదం పిల్లలు బతికి బయటపడ్డారు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న 12 మంది విద్యార్థులను సాధారణ వార్డుకు మార్చినట్లు యశోద గ్రూప్ హాస్పిటల్ డైరెక్టర్ డా.లింగయ్య తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 12 మంది విద్యార్థులను రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని అన్నారు.

ప్రశాంతి, వరుణ్‌గౌడ్, వైష్ణవి, తరుణ్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరో నలుగురు విద్యార్థులు శివకుమార్, నిత్మష, శ్రీవాణి, శరత్ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు యశోద వైద్య బృందం ఎప్పటికప్పుడు మెరుగైన వైద్యం అందిస్తోందని తెలిపారు.

ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థులకు ఎలాంటి శస్తచ్రికిత్స అవసరం లేదని వెల్లడించారు. కాగా, విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రిలో ఆందోళనతో ఉన్నారు. తమ బిడ్డ ఆరోగ్యం ఎప్పుడు కుదుటపడుతుందోనని వేచిచూస్తున్నారు.

విద్యార్థుల స్థితిపై...

విద్యార్థుల స్థితిపై...

మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్య పరిస్థితిపై యశోదా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ లింగయ్య ఆదివారం మీడియా ప్రతినిధులకు వివరించారు.

ఈ లోకంలోకి...

ఈ లోకంలోకి...

రైలు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందిన ఓ చిన్నారి తిరిగి ఈ ప్రపంలోకి ఇలా..

మచ్చలు మాసేనా...

మచ్చలు మాసేనా...

రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందిన ఈ విద్యార్థి ముఖం నిండా గాయాలే.. ఆ ప్రమాదం మచ్చలు మానుతాయా.

సంతోషం ఇలా..

సంతోషం ఇలా..

రైలు ప్రమాదానికి గురై చికిత్స పొంది కోలుకున్న చిన్నారి చూసిన తర్వాత గుండె నిండా ఊపిరి పోసుకున్నట్లు ఇలా..

పాప బతికింది...

పాప బతికింది...

రైలు ప్రమాదం గండం నుంచి ఈ పాప బయటపడింది. ఆ తల్లిదండ్రులకు అదే పదివేలు.. ఒక్కటి రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి కూడా బయటపడుతుంది.

నొప్పులు తగ్గలేదా...

నొప్పులు తగ్గలేదా...

రైలు ప్రమాదం భయానక దృశ్యం ఇంకా ఆ పాప మనసులో కదులాడుతూనే ఉందా... ఇలా ముఖంలో బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

ఎగిరి గంతులేయడానికి..

ఎగిరి గంతులేయడానికి..

తిరిగి ఎగిరి గంతులు వేయడానికి ఇంకా రెండు మూడు రోజులే అని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రి మంచం మీద ఇలా.

సంతోషం విరబూస్తే...

సంతోషం విరబూస్తే...

ప్రమాదం నుంచి బయటపడిన ఈ చిన్నారి తిరిగి ఈ లోకంలోకి వచ్చింది. సెల్ ఫోన్లో ఆట ఆడుతోందా... చూడండి.. నవ్వు విరబూసింది.

కడుపు కోత తప్పింది...

కడుపు కోత తప్పింది...

రైలు ప్రమాదంలో మరణించిన పిల్లల కడుపు కోత చెప్పనలవి కాదు. . ఈ తల్లులకు కడుపు కోత తప్పింది.

ఎలా ఉంది...

ఎలా ఉంది...

యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను వైద్యులు ఇలా పలకరిస్తూ 12 మందిని బయటపడేశారు.

ఏమైందీ...

ఏమైందీ...

క్షణాల్లో రైలు పాఠశాల బస్సును ఢీకొనడంతో పిల్లలు షాక్‌కు గురయ్యారు. ప్రమాదంలో గాయపడిన పిల్లల స్థితి ఇలా..

కాస్తా చూడండి...

కాస్తా చూడండి...

రైలు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న తమ పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ తల్లులు ఇలా.

ఎంపి పరామర్శ

ఎంపి పరామర్శ

యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ంఎంపి బివి పటేల్ పాటిల్ పరామర్శించారు.

English summary
Yasoda hospital director Dr Lingaiah said that injured children in Masaipet rail accident will be discharged within 2 or 3 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X