హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కష్టాలు ఉండవు!: సాగర్‌లు ఇలా నిండాయి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వర్షాకాలంలోనూ నీటి కష్టాలు ఎదుర్కొంటున్న నగరవాసులు వరణుడి కరుణతో గట్టెక్కారు. కొద్దిరోజులుగా నగరంలో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్(బుద్వేల్ చెరువు)లు జలకళను సంతరించుకున్నాయి.

వర్షాకాలానికి ముందు నీటి మట్టాలు బాగా అడుగంటిపోవటంతో మున్ముందు జంటనగరవాసులకు తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉన్న సమయంలో నగరంలో భారీ వర్షాలు కురిసినందున ఇక కొద్ది నెలల వరకు తాగునీటి సరఫరాకు ఢోకా లేదనే చెప్పవచ్చు.

ఈ క్రమంలో మున్ముందు ఎదురయ్యే గడ్డు సమస్యలను ఎలా ఎదుర్కొంటామోనంటూ ఆందోళనకు గురైన జలమండలి అధికారులకు భారీ వర్షాలు కాస్త ఊరటను కల్గించాయి.

 హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

హిమాయత్‌సాగర్ ఎగువ ప్రాంతాలైన పరిగి, తాండూరు పరిసర ప్రాంతాల నుంచి ఏర్లు, కుంటలు, చెరువుల నుంచి భారీగా వరద నీరు ఆ చెరువులోకి చేరుతుంది.

హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

మోతాదుకు మించి నీరు రిజర్వాయర్‌లో చేరటంతో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి, చెరువుకు దిగువనున్న ప్రాంతాల్లోని ప్రజలను కూడా అప్రమత్తం చేశారు.

హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

అలాగే మరో ప్రధాన జలాశయమైన గండిపేటలో కూడా ఆశించిన స్థాయిలో నీరు చేరింది. ఈ జలాశయానికి ఎగువ ప్రాంతాలైన శంకర్‌పల్లి, వికారాబాద్ తదితర ప్రాంతాల మీదుగా ఈసి నది ద్వారా వరద నీరు చేరుతుంది.

 హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

రెండురోజుల భారీ వర్షానికే ఎక్కువ మోతాదులో వరద నీరు చెరువులోకి చేరేందుకు అధికారులు గతంలో చేపట్టిన చర్యలే కారణమని చెప్పవచ్చు.

 హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

జలమండలికి అదర్‌సిన్హా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నపుడు ఈసి నది పరివాహక ప్రాంతాలను తనిఖీ చేసి, వరద నీరు రాకుండా ఏర్పడిన అడ్డంకుల్లో ఎక్కువ శాతం తొలగించటంతో ఇపుడు నీరు ఆశించిన స్థాయిలో జలాశయంలోకి నీరు చేరుతుంది.

 హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

ఉస్మాన్‌సాగర్ జలాశయంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా 0.2 టిఎంసిల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ నీరు నగరానికి నెలరోజుపాటు సరఫరా చేయవచ్చునని వెల్లడిస్తున్నారు.

హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

అలాగే హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ ఉస్మాన్‌సాగర్ కన్నా ఎక్కువ మోతాదులో నీరు చేరినట్లు తెలిపారు. ప్రధాన జలాశయమైన ఉస్మాన్ సాగర్ మొత్తం నీటి సామర్థ్యం 1790 అడుగులుండగా, ప్రస్తుతం 1769.650 అడుగుల వరకు నీరుంది.

 హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

గత సంవత్సరం ఇదే తేదీ నాటికి ఈ రిజర్వాయర్‌లో 1758.350 ఉండగా, ఈ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పదకొండు అడుగుల కన్నా ఎక్కువ నీరు చేరింది.

హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

దీంతో పాటు హిమాయత్‌సాగర్ జలాశయం మొత్తం నీటి సామర్థ్యం 1763.500 అడుగులుండగా, ప్రస్తుతం నీటి మట్టం దాదాపు 1749.100ల వరకు ఉంది.

 హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్

ఉస్మాన్‌సాగర్‌లో ప్రస్తుతమున్న నీటిని నెలరోజుల పాటు సరఫరా సరిపోగా, హిమాయత్‌సాగర్‌లోని నీరు 133 రోజుల పాటు సరిపోయే అవకాశముందని అధికారులు తెలిపారు.

English summary

 Incessant rain may have dampened the spirits of farmers, but have certainly brought back smiles on the faces of Hyderabad Metropolitan Water Supply and Sewerage Board (HMWS&SB) officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X