వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మురళీ మోహన్ భార్య ఆస్తులు తప్పు: జగన్ పార్టీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజమండ్రి లోకసభ అభ్యర్థి మురళీ మోహన్ దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన భార్య ఆస్తుల వివరాలను మురళీ మోహన్ తప్పుగా చూపించారని ఆ పార్టీ ఆరోపించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై మురళీ మోహన్ అఫిడవిట్‌ను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి వివరణ కోరారు.

సీమాంధ్రలో లోకసభ, శాసనసభా స్థానలాకు పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు సోమవారం పరిశీలించారు. అయితే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువరి నామినేషన్నలపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయగా, మరి కొంతమంది నామినేషన్లపై ప్రత్యర్థులు ఫిర్యాదు చేశారు.

Returning officer seeks clarification from Murali Mohan

విశాఖపట్నం జిల్లా భిమిలీ శాసనసభా స్థానం అభ్యర్థి గంటా శ్రీనివాసరావుపై సిపిఎం నాయకులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టులున్న శ్రీనివాస రావుకు పోటీకి అనర్హుడంటూ రిటర్నింగ్ అధికారికి సిపిఎం నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే నియోజకవర్గంలో జైసమైక్యాంధ్ర అభ్యర్థి వినోద్ కుమార్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

ఆయన వయస్సు కనీసం ఉండాల్సిన దానికన్నా రెండు రోజులు తక్కువగా ఉండడంతో రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. ఇదే జిల్లా పాయకరావు పేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనిత కుల ధ్రువీకరణ పత్రంపై ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభా నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి నామినేషన్‌పై తెలుగుదేశం పార్టీ నేత రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు.

English summary
YSR Congress party leaders complaind against Rajamundry Telugudesam party candidate Murali Mohan to the eturning officer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X