హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రో రైలు పణంగా పెడతారా?: కెసిఆర్‌పై రేవంత్ ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెట్రో రైలు ప్రాజెక్టును ఉపసంహరించుకునే నిర్ణయానికి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు కారణం కాదా? అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో రైలు హైదరాబాద్ నుంచి ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వ దొరతనమే కారణమని అన్నారు.

కెసిఆర్ తన సహచరులు, బంధువుల కోసం మెట్రో రైలును పక్కన పెడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఓ దొర భూమి కోసం మెట్రో రైలునే పణంగా పెడతారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయ అవినీతిని పాతరేస్తామని చెప్పిన కెసిఆర్, అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Revanth fires at KCR on issue of metro rail

మెట్రో రైలు ఉపసంహరించుకోవడమనేది అషామాషీ నిర్ణయం కాదని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల హైదరాబాద్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఉండాలా లేదా అని ఆయన ప్రశ్నించారు. కీలకమైన మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వానికి స్పష్టత లేదని అన్నారు. దీనిపై తెలంగాణ మేధావులు ఆలోచించాలని అన్నారు.
మెట్రో రైలు కోసం కేటాయించిన గచ్చిబౌలిలోని స్థలాన్ని లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

మెట్రో రైలు డిజైన్ విషయంలో ఎల్ అండ్ టిని ఒప్పించలేకపోయారని ప్రభుత్వంపై మండిపడ్డారు. మీ దురాశ కోసం మెట్రో రైలును పణంగా పెడతారా? అని రేవంత్ ప్రశ్నించారు. తాను చెప్పింది అబద్ధమైతే ప్రభుత్వం అధికారికంగా స్పందించాలని డిమాండ్ చేశారు. తనపైనా కేసు వేయాలని సవాల్ విసిరారు. మెట్రో రైలు ఆగిపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోతుందని అన్నారు. పారిశ్రామిక సంస్థలు ఇక్కడకు రావని అన్నారు.

English summary
Telugudesam Party senior leader Revanth Reddy on Wednesday fired at K Chandra sekhar Rao on issue of metro rail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X