వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌కు దక్కని మల్కాజిగిరి: మోత్కుపల్లికి మథిర

By Pratap
|
Google Oneindia TeluguNews

 Revanth Reddy denied Malakagigiri ticket
హైదరాబాద్: మల్కాజిగిరి లోకసభ స్థానం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వద్ద మొండిపట్టు పట్టిన రేవంత్ రెడ్డి దాన్ని సాధించుకోవడంలో విఫలమయ్యారు. రేవంత్ రెడ్డిని బుజ్జగించి, ఆయనను తిరిగి మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ శాసనసభా నియోజకవర్గం నుంచే పోటీకి దించుతున్నారు.

మంగళవారం రాత్రి చంద్రబాబు నాయుడు కొడంగల్‌నుంచి పోటీ చేయవలసిందిగా రేవంత్‌ రెడ్డికిసూచించారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావును, ఖమ్మం జిల్లా మథిరలో మోత్కుపల్లి నర్సింహులు పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. ఈ ముగ్గురికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రగిలిన వివాదం ఇంతటితో ముగిసినట్టే భావించాలి.

వారి ముగ్గురికి టికెట్లు ఖరారు చేసే సమయంలో చంద్రబాబు నివాసంలోనే ఉన్న మల్లారెడ్డిని మల్కాజ్‌గిరిలో ఎలా గెలుస్తావో చూస్తానని రేవంత్ రెడ్డి సవాలు విసిరినట్టు తెలుస్తున్నది. అయితే ఇంతటితో మల్కాజిగిరి వివాదాన్ని ఇంతటితో ముగించవలసిందిగా చంద్రబాబు రేవంత్ రెడ్డిని కోరినట్టు తెలుస్తోంది.

ఎట్టి పరిస్థితులలోనూ మల్కాజ్‌గిరినుంచే లోక్‌సభకు పోటీ చేయాలని రేవంత్ రెడ్డి గట్టిగా కోరుకున్నారు. పార్టీ మద్దతుదారులు బాగా ఉండడం, ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారు కూడా ఎక్కువగా ఉండడం, వారికి ఒక భరోసా ఇవ్వవలసిన అవసరం ఉండడం వంటి కారణాలవల్ల తనకు మల్కాజిగిరి సీటు కావాలని రేవంత్ రెడ్డి పట్టుబట్టారు.

English summary
Telugudesam party leader Revanth Reddy has failed get Malkagigiri Lok Sabha seat. TDP president Nara Chandrababu Naidu has nominated him from Kodangal seat in Mahaboobnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X