మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగ్గారెడ్డిని గెలిపిస్తే.. రేవంత్ ఆఫర్, చెప్పుతో కొడ్తామని

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెదక్ లోకసభ నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే గజ్వేల్‌కు రైల్వే లైన్ వేయిస్తారని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మంగళవారం అన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. జగ్గారెడ్డిని గెలిపిస్తే ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు వెళ్లి పనులు చేయించుకోవచ్చన్నారు. గజ్వెల్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఎదురు నిలిచే మొనగాడు ప్రతాప్ రెడ్డేనని చెప్పారు.

గజ్వెల్‌లో తెరాస కంటే మనకు ఒక్క ఓటైనా ఎక్కువ రావాలని అన్నారు. జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డిలు కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు. మెదక్‌లో ఒకవేళ తెరాస అభ్యర్థి గెలిస్తే.. పాంహౌస్‌లో కేసీఆర్ ముందు సోడా పోయడానికి పనికొస్తాడని, ఎంపీ కవిత బ్యాగులు మోయడానికి పనికి వస్తాడు తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడడన్నారు. తమను విమర్శిస్తే మరొక్కసారి తమను సమైక్యవాదులు అంటే చెప్పుతో కొడతామన్నారు.

కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా జగ్గారెడ్డికే ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ రైతుల సమస్యలు మరిచిపోయారని విమర్శించారు. రుణమాఫీ పైన స్పష్టత లేదన్నారు.

Revanth Reddy and Jagga Reddy lashed out at KCR

కేసీఆర్ పైన నిప్పులు చెరిగిన కాంగ్రెస్

కేసీఆర్ పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను మహాత్ముడితో పోల్చడం తగదని షబ్బీర్ అలీ అన్నారు. తెరాస ప్రభుత్వం మాయమాటలతో పబ్బం గడుపుకుంటోందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేకపోతోందన్నారు. రుణమాఫీపై అసత్యాలు చెబుతోందని ఆరోపించారు. తెలంగాణ వస్తే అద్భుత జీవితం, బంగారు, సామాజిక తెలంగాణ వస్తుందనుకున్న వారికి తెరాస ప్రభుత్వం నిరాశను మిగిల్చిందన్నారు.

రుణాలు మాఫీ చేయకుంటే రైతులతో కలిసి తాము ఉద్యమిస్తామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం చేయకపోయినా.. దోపిడీ చేయకుంటే చాలన్నారు. తెరాసకు, కేసీఆర్‌కు మహిళలు అంటే ఏమాత్రం విలువల లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తమ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మా రెడ్డి గురించి చులకనగా మాట్లాడుతున్నారన్నారు.

బీఈఎల్ కంపెనీల ఈవీఎంలు, ఓటింగ్ శాతం పెంచేందుకు,

కేసీఆర్ ను మహాతు్ముడితో పోల్చడం తగదు, షబ్బీర్

మాయ మాటలతో పబ్బం, వాగ్దానాలు నెరవేర్చలేకపోతోంది, రుణాల మాఫీపై ప్రభుత్వ అసత్యాలు చెబుతోంది, అద్భుద జవితం బంగారు సామాజిక తెలంగాణ వస్తుందనుకున్ వారికి నిరాశే, బట్టి, రుణాలు మాఫీ చేయకుంటే రైతులతో కలిసి ఉద్యమం, టి పునర్మ్ర్మాణం చేయకున్నా దోపిడీ వద్దు

అధికార దుర్వినియోగం వద్దు: భన్వర్ లాల్

మెదక్ లోకసభకు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎవరు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని భన్వర్ లాల్ అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రేపటి నుండి స్లిప్పుల పంపిణీ ఉంటుందన్నారు.

English summary
Telugudesam leader Revanth Reddy, BJP MP candidate Jagga Reddy lashed out at KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X