వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా విభాగానికి రోజా: యూత్‌కు వంగవీటి రాధా

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు. పార్టీలోని కొన్ని ముఖ్యమైన పదవులను ఆయన భర్తీ చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును, గొల్ల బాబూరావును ఆయన నియమించారు. అనుబంధ సంస్థల నాయకత్వాలను కూడా ఆయన ఖరారు చేశారు.

వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా వంగవీటి రాధ, మహిళా విభాగం అధ్యక్షురాలుగా రోజా నియమితులయ్యారు. రాష్ట్ర బీసీ సెల్‌ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా మెరుగ నాగార్జున, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడిగా పి. సుధాకరరెడ్డి, మైనారిటీ సెల్‌ అధ్యక్షుడిగా అమ్‌జాద్‌ బాషాను నియమించారు.

Roja to lead YSRCP women wing

రైతు విభాగం అధ్యక్షుడిగా నాగిరెడ్డి, ఎస్టీసెల్‌ అధ్యక్షుడిగా బాలరాజు, ట్రేడ్‌ యూనియన్‌ విభాగానికి గౌతం రెడ్డిని, రాష్ట్ర కార్యదర్శులుగా మేడపాటి వెంకట్‌, రాజీవ్‌కృష్ణ, ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తలసిల రఘురాం, జక్కంపూడి రాజా, కాసిరెడ్డి వెంకట రమణారెడ్డి, చల్లా మధుసూధనరెడ్డి, లేల్ల అప్పిరె డ్డి, ముదునూరి ప్రసాదరాజు, అనిల్‌ యాదవ్‌లను నియమించారు.

ప్రధాన కార్యదర్శుల విభాగంలో ఉత్తరాంధ్రకు సుజయ్‌కృష్ణ రంగారావు, ఉభయగోదావరి జిల్లాలకు ధర్మాన ప్రసాదరావు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు మోపిదేవి వెంకటరమణ, చితూర్తు, కడప జిల్లాలకు జంగా కృష్ణమూర్తి, ప్రకాశం జిల్లాకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు భూమన కరుణాకర్‌రెడ్డి బాధ్యతలు వహిస్తారు. గ్రామకమిటీ, యువజన, మహిళా, విద్యార్థి, సేవాసంఘం, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ విభాగాలకు విజయసాయిరెడ్డి, అడ్మినిస్టేషన్‌ విభాగానికి పీఎన్‌వీ ప్రసాద్‌ను నియమించారు.

English summary
MLA Roja will lead YS Jagan's YSR Congress party women wing and Vangaveeti Radha will lead youth wing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X