వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'టీ ఉద్యమంలో సానియామీర్జా ఎక్కడ?': సల్మాన్ సపోర్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్‌గా నియమించబడినప్పటి నుండి సానియా మీర్జా పైన దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఆమె స్థానికత పైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, తెలంగాణ ఉద్యమంలో సానియా ఎక్కడ అని కూడా ప్రశ్నిస్తున్నారు.

బీజేపీ శాసన సభా పక్ష నేత లక్ష్మణ్, తెలుగు యువత నేతలు, తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, వి హనుమంత రావు తదితరులు సానియా నియామకాన్ని తప్పు పట్టారు. అయితే, వారి వారి వ్యాఖ్యలను ఆయా పార్టీలు తప్పు పట్టాయి. అయినప్పటికీ స్థానిక నేతలు మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు.

Salman Khan supports Sania Mirza

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబడిన సానియా మీర్జా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని, ఆమె ఉద్యమంలో పాల్గొనలేదని అంటున్నారు. అయితే, ఆమె నియామకాన్ని కాంగ్రెసు, బీజేపీ జాతీయ నేతలు మాత్రం స్వాగతిస్తున్నారు.

దీనిపై సానియా కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. తాను వివాదాల జోలికి పోదల్చుకోలేదని చెప్పారు. తాను ఎప్పటికీ భారతీయురాలినేనని, తాను భారతీయురాలినని ఎన్నిసార్లు చెప్పాలన్నారు. తన మూలాలను ప్రశ్నించేవారిని వదిలిపెట్టనని, భారతీయురాలినని చెప్పకోవడం గర్వంగా ఉందన్నారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్.. సానియా మీర్జాకు మద్దతు ప్రకటించారు.

English summary
Bollywood superstar Salman Khan too praised Sania while she faced criticism from many.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X