హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్త కోసం అత్తారింటి వద్ద వైద్యురాలు ధర్నా (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తన భర్తను తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ అత్తారింటి ముందు ధర్నాకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్తను తన నుంచి దూరం చేయొద్దని, తన కాపురాన్ని కాపాడాలని ఓ హోమియోపతి వైద్యురాలు అత్తగారింటి ముందు ధర్నాకు చేపట్టింది.

అల్వాల్‌ ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వర్‌రావు, సత్యనారాయణమ్మల కూతురు హోమియోపతి వైద్యురాలు సత్యవాణి(27). మెదక్‌ జిల్లా మాచవరం గ్రామానికి చెందిన గుర్రం వెంకటేశ్వర్లు, పద్మావతి కుమారుడు గుర్రం అనిల్‌కుమార్‌ ఫిజియోథెరపిస్ట్‌. ఇద్దరూ నిరుడు నవంబర్‌ 15న ప్రేమ వివాహం చేసుకున్నారు.

అప్పటినుంచి అల్వాల్‌లోని గోల్డెన్‌ రెసిడెన్సీలో సత్యవాణి, భర్త అనిల్‌కుమార్‌, అత్తమామలతో కలిసి ఉంటోంది. కొన్నాళ్లకు అత్తాకోడళ్లకు గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో వేరే కాపురం పెట్టుకోవాలని పద్మావతి కుమారుడు, కోడలికి చెప్పింది. దీంతో దంపతులు అల్వాల్‌లోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అల్వాల్‌ పోలీసులు కుటుంబ సభ్యులపై 498ఏ కింద కేసు నమోదు చేశారు.

ఈ ఇంటి వద్దే...

ఈ ఇంటి వద్దే...

తన భర్తను తనకు అప్పగించాలని తన అత్తారింటి ముందు ఓ హోమియోపతి వైద్యురాలు సత్యవాణి ధర్నాకు దిగింది.

సత్యవాణి రోదన

సత్యవాణి రోదన

గోల్డెన్‌ రెసిడెన్సీలోని ఫ్లాట్‌ వద్ద తాను ధర్నాకు దిగిన సమయంలో అత్తమామలు ఇంట్లోనే ఉన్నారని, ఇక్కడెందుకు ఉన్నావని తనను తిట్టారని సత్యవాణి రోదించింది.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

తన భర్తను మూడు నెలలుగా తనకు కనిపించకుండా అత్త పద్మావతి, మామ వెంకటేశ్వర్లు, బావ సాయి అమర్‌నాధ్‌, తోటికోడలు అనురాధ కుట్రపన్ని మోసం చేస్తున్నారని బాధితురాలు సత్యవాణి మంగళవారం సికింద్రాబాదులోని అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భర్తను తీసుకెళ్లారు

భర్తను తీసుకెళ్లారు

పదిరోజుల తరువాత మే 23న అత్త పద్మావతి తన భర్తను తమ అద్దె ఇంట్లోంచి బయట పని ఉందని తీసుకెళ్లిందని, అప్పటినుంచి తన భర్త అనిల్‌కుమార్‌ జాడ తెలియడం లేదని సత్యవాణి అంటోంది.

English summary
A Homeopathy doctor staged dharna in front of in laws house at Alwal in secunderabad for her husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X