హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెక్స్‌రాకెట్లో ముంబై మోడల్, ఇద్దరి అరెస్ట్, లేని కస్టమర్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో పోలీసులు గురువారం రాత్రి ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. ముంబైకి చెందిన మోడల్‌ను రక్షించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో గల ఓ ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.

సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో వారు ముంబైకి చెందిన మోడల్‌ను వ్యభిచారం నుండి రక్షించారు. ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు.

Sex racket busted, two arrested

వ్యభిచారంలో పట్టుబడ్డ సదరు ముంబై మోడల్ వయస్సు 24 వరకు ఉంటుంది. తాను ముంబై నుండి వచ్చినట్లు చెప్పిందని తెలుస్తోంది. కాగా, అరెస్టైన ఇద్దరిలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అంకిత్, బీహార్‌కు చెందిన పప్పు కుమార్‌లు ఉన్నారు. తమకు సమాచారం అందడంతో సోదాలు నిర్వహించామని, వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలియడంతోనే తాము వారిని కస్టడీలోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

ముంబైకి చెందిన మోడల్‌ను వ్యభిచారం నిమిత్తం హైదరాబాదుకు తీసుకు వచ్చారని చెప్పారు. అయితే, విషయం తెలియడంతో ముందే పోలీసులు దాడులు చేసి అరెస్టు చేశారు. కాగా, పోలీసులు దాడి చేసిన సమయంలో కస్టమర్లు ఎవరు లేరు. పోలీసులు కేసు నమోదు చేసుకని దర్యాఫ్తు చేస్తున్నారు. బాధితురాలిని రెస్క్యూ హోంకు తరలించారు. అరెస్టు చేసిన ఇద్దరిని జ్యూడిసియల్ కస్టడీకి తరలించారు.

English summary
The Banjara Hills police on Thursday busted a sex racket in road number 12, Banjara Hills and rescued a Mumbai-based model from prostitution. They also arrested two organisers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X