వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినుకొండ - మార్టూరు బెట్టర్: శివరామకృష్ణన్ కమిటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి వినుకొండ - మార్టూరు ప్రాంతం సరైందేనని శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. ఈ ఏడాది జూలైలో ప్రణాళికా విభాగం రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాలను రాజధాని ఏర్పాటు కోసం సూచిస్తూ సమాచారాన్ని ఇచ్చింది. ఇవన్నీ మధ్యాంధ్రలోనే ఉన్నాయని కమిటీ వెల్లడించింది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలోని ప్రాంతాలను ఒకటి రెండింటినైనా ప్రభుత్వం ప్రతిపాదించకపోవడంపై కమిటీ విస్తుపోయింది.

మీడియా కథనాల ప్రకారం - రాష్ట్ర ప్రణాళికా శాఖ ప్రతిపాదించిన ఆ 8 ప్రాంతాలు - ముసునూరు, మంగళగిరి, పులిచింతల, మాచర్ల, బొళ్లపల్లి, మార్టూరు, వినుకొండ, దొనకొండ. మాచర్ల, పులిచింతల రెండూ తెలంగాణ సరిహద్దులో ఉన్నందున రాజధానికి ఇవి ఉపయుక్తం కావని కమిటీ తెలిపింది. రాజధాని కోసం రాష్ట్రం సూచించిన ఈ 8 ప్రాంతాలు, ప్రతిపాదిత కారణాలను చూస్తే, మార్టూరు - వినుకొండలకు మాత్రమే తదుపరి పరిశీలనకు అర్హత ఉందని అభిప్రాయపడింది. అసెంబ్లీ, సచివాలయం ఏర్పాటుకు మార్టూరు-వినుకొండను పరిశీలించవచ్చునని తెలిపింది.

Shivarama Krishnan committee suggested Vinukonda area for capital

అసెంబ్లీ, ముఖ్యమంత్రి కార్యాలయం, సెక్రటేరియేట్‌, హైకోర్టు ఎక్కడ ఉంటే దానిని రాజకీయ రాజధానిగా పరిగణిస్తుంటారని, భూమి అందుబాటులో ఉంటే వీటన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేయాలి గానీ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రత్యేక పరిస్థితులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించాల్సిన నేపథ్యంలో కొన్ని ప్రత్యామ్నాయాలను చూడటం అనివార్యమని కమిటీ తెలిపింది.

రాష్ట్ర శాసనసభ, శాసన మండలిని మార్టూరు-వినుకొండలో ఏర్పాటు చేస్తే ఏడాదికి ఒకసారైనా అసెంబ్లీ సమావేశాలను రాయలసీమ జోన్‌లోనూ నిర్వహించాలని తెలిపింది. కర్ణాటకలో బెల్గాం, మహారాష్ట్రలో నాగపూర్‌లో ఇలాంటి ఏర్పాటు ఉందని గుర్తు చేసింది.

మీడియా కథనాల ప్రకారం శివరామకృష్ణన్ కమిటీ నివేదికలోని ముఖ్యాంశాలు..

* విభజన తర్వాత కూడా ఒకటి రెండు ప్రాంతాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలను, పెట్టుబడులను పెడతారేమోనన్న ఆందోళన విస్తృతంగా ఉంది.

* ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వ్యవసాయానికి ఉపయోగపడని భూములు కానీ, డీగ్రేడెడ్‌ అటవీ భూములు కానీ లేవు. అక్కడక్కడ మాత్రం భూములు అందుబాటులో ఉన్నాయి.

* వీజీటీఎం జనాభా 17.22 లక్షలు. వీరిలో 82 శాతం వ్యవసాయంపై ఆధారపడినవారే.
రవాణా అవసరాల దృష్ట్యా విజయవాడ చుట్టూ రింగ్‌ రోడ్‌ నిర్మించాలి.

* కాళహస్తి-నడికుడి లైన్‌ నిర్మాణానికి ఇంకా రూ.291 కోట్లు ఖర్చవుతుంది. కానీ, ఈ బడ్జెట్‌లో కేవలం రూ.5 కోట్లు కేటాయించారు.

* డైరెక్టరేట్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ కార్యాలయం ముందు నుంచీ అనంతపురంలోనే ఉంది. దానిని అక్కడే కొనసాగించాలి.

* పోర్టులు, పరిశ్రమలు, ఎగుమతులు, మత్స విభాగాలకు చెందిన కమిషనరేట్లు, డైరెక్టరేట్లను వైజాగ్‌ జోన్‌లో ఏర్పాటు చేయొచ్చు.

* సచివాలయం ఉన్న ప్రాంతంలోనే కమిషనరేట్లు, డైరెక్టరేట్లు ఉండాలని, తద్వారా ప్రభుత్వ కార్యకలాపాలు సులువు అవుతాయని కొందరు వాదించవచ్చు. ఆధునిక సమాచార వ్యవస్థలు అందుబాటులో ఉన్నందున ఈ భౌతిక దూరం లెక్కలోకి రాదు.

* పునరుత్పాదక ఇంధన కార్యకలాపాలకు సంబంధించి రాయలసీమ ప్రాంతంలో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.

English summary
Shivarama Krishnan committee suggested Vinukonda - Martur area for Andhra Pradesh capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X