వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లెక్కలేని స్నేక్ గ్యాంగ్ ఆగడాలు: 11 మందిపై రేప్‌లు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: స్నేక్ గ్యాంగ్ ఆగడాలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి. ఇందుకు సంబంధించి గురువారం మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. పాములతో బెదిరించి నిస్సహాయులైన 11 మంది మహిళలపై స్నేక్ గ్యాంగ్ అత్యాచారాలు చేసినట్లు మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి.

మరో 30-40 సెటిల్‌మెంట్లు చేసింది. పహాడీ షరీఫ్‌లోని ఫాంహౌస్‌లో ఓ యువతిని పాముతో బెదిరించి సామూహిక అత్యాచారం చేసి దొరికిపోయిన ఈ గ్యాంగ్‌ను పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. గ్యాంగ్‌లో కీలకమైన ఫైసల్‌ దయానీ, సాలం హందీలను బుధవారం విచారించి వారి సెల్‌ఫోన్లను పరిశీలించారు.

అందులో ఉన్న వీడియోలను పరిశీలిస్తే ఈ గ్యాంగ్‌ కనీసం 11 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డట్టు తేలిందని అంటున్నారు. ఈ అత్యాచారాలను వారు ఎక్కడెక్కడ చేశారన్నది తెలియాల్సి ఉంది. ఇంకా ఆ సెల్‌ఫోన్‌లోని మెమొరీ కార్డుల్లో ఇంతకు ముందు డిలీట్‌ చేసిన వీడియోలు ఏవైనా ఉన్నాయా అనే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

snake gang

సెటిల్‌మెంట్ల వ్యవహారాలను కూడా పోలీసులు తేల్చే పనిలో పడ్డారు. హైదరాబాద్‌ శివార్లలోని నిర్మానుష్య ప్రాంతాలను ఈ ముఠా తమ పంచాయితీలకు ఎంచుకుంటుంది. సెటిల్‌మెంట్‌ సమయంలో కొందరిని దయానీ, హందీ కొడుతుంటే గ్యాంగ్‌లోని మిగతా సభ్యులు దాన్ని చిత్రీకరిస్తుండేవారని ఈ ప్రముఖ దినపత్రిక రాసింది. ఈ వీడియోలు కూడా ఉండడంతో పోలీసులు వాటిపైనా నిందితులను ప్రశ్నిస్తున్నారు. సెటిల్‌మెంట్లలో ఎంతెంత వసూలు చేశారో తేల్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇ

స్నేక్ గ్యాంగ్‌కు లీడరైన ఫైసల్‌ దయానీ హైదరాబాద్‌కు వచ్చి కేవలం నాలుగు నెలలే అయింది. అంతకుముందు అతడు దుబాయ్‌లో జిమ్‌ కోచ్‌గా పనిచేసేవాడు. ఇక్కడికి వచ్చాక కూడా జిమ్‌ ప్రారంభించి నాలుగు నెలల వ్యవధిలోనే ఇన్ని దుర్మార్గాలకు పాల్పడ్డాడు. అయితే ఈ గ్యాంగ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. దయాని, సాలం హందీని బుధవారం కస్టడీకి తీసుకున్నప్పటికీ పహాడీషరీఫ్‌ పోలీసులు మాత్రం అటువంటిదేమీ లేదని చెబుతున్నారు.

English summary
According to media reports - snake gang has commited rapes against 11 women. Dayanim the gang leader has come Hyderabad from Dubai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X