హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోమాలోనే శోభా: హైదరాబాద్‌కు జగన్, వైద్యులకు ఫోన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి ఇంకా కోమాలోనే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఆమెకు వెంటిలెటర్ పైన చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శోభాను చూసేందుకు పార్టీ నేతలతో పాటు, ఇతర పార్టీల నేతలు కూడా తరలి వస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. శోభా, తన పార్టీలు వేరువేరు అయినా... ఆమె ఎంతో కష్టపడి పని చేసే గుణం ఉన్న వ్యక్తి అని, ఈ ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసిందని నన్నపనేని అన్నారు. అర్ధరాత్రి ప్రయాణాలు వద్దని, వేగంగా వెళ్లవద్దని నన్నపనేని సూచించారు.

శోభా కుటుంబం తమ కుటుంబానికి చాలా సన్నిహితులన్నారు. ఆమెకు క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మైసూరా రెడ్డి, నాడు వైయస్ వద్ద పని చేసిన సూరీడు తదితరులు ఆసుపత్రికి వచ్చారు. ఆళ్లగడ్డ నుండి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.

Sobha Nagireddy in Care Hospital

హైదరాబాదుకు విజయమ్మ, జగన్

గుంటూరు జిల్లా ప్రచారంలో ఉన్న వైయస్ జగన్, రాజమండ్రి ప్రచారంలో ఉన్న వైయస్ విజయమ్మ, తెలంగాణ ప్రచారంలో ఉన్న షర్మిలలు హైదరాబాదుకు బయలుదేరారు. వారు తమ ప్రచారాన్ని అర్ధాంతరంగా ఆపివేశారు. కడప నుండి వైయస్ జగన్ భార్య భారతి బయలుదేరారు.

వైద్యులకు జగన్ ఫోన్

వైయస్ జగన్మోహన్ రెడ్డి కేర్ ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేశారు. ఆయన ఎప్పటికప్పుడు ఫోన్లో వైద్యుల నుండి సమాచారం తెలుసుకుంటున్నారు. ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదని, ఆమె ఆరోగ్యం బాగుపడేలా చూడాలని జగన్ వైద్యులకు సూచించారు.హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి ఇంకా కోమాలోనే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఆమెకు వెంటిలెటర్ పైన చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శోభాను చూసేందుకు పార్టీ నేతలతో పాటు, ఇతర పార్టీల నేతలు కూడా తరలి వస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. శోభా, తన పార్టీలు వేరువేరు అయినా... ఆమె ఎంతో కష్టపడి పని చేసే గుణం ఉన్న వ్యక్తి అని, ఈ ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసిందని నన్నపనేని అన్నారు. అర్ధరాత్రి ప్రయాణాలు వద్దని, వేగంగా వెళ్లవద్దని నన్నపనేని సూచించారు.

శోభా కుటుంబం తమ కుటుంబానికి చాలా సన్నిహితులన్నారు. ఆమెకు క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మైసూరా రెడ్డి, నాడు వైయస్ వద్ద పని చేసిన సూరీడు తదితరులు ఆసుపత్రికి వచ్చారు. ఆళ్లగడ్డ నుండి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.

హైదరాబాదుకు విజయమ్మ, జగన్

గుంటూరు జిల్లా ప్రచారంలో ఉన్న వైయస్ జగన్, రాజమండ్రి ప్రచారంలో ఉన్న వైయస్ విజయమ్మ, తెలంగాణ ప్రచారంలో ఉన్న షర్మిలలు హైదరాబాదుకు బయలుదేరారు. వారు తమ ప్రచారాన్ని అర్ధాంతరంగా ఆపివేశారు. కడప నుండి వైయస్ జగన్ భార్య భారతి బయలుదేరారు.

వైద్యులకు జగన్ ఫోన్

వైయస్ జగన్మోహన్ రెడ్డి కేర్ ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేశారు. ఆయన ఎప్పటికప్పుడు ఫోన్లో వైద్యుల నుండి సమాచారం తెలుసుకుంటున్నారు. ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదని, ఆమె ఆరోగ్యం బాగుపడేలా చూడాలని జగన్ వైద్యులకు సూచించారు.

English summary
YSR Congress Party leader Sobha Nagi Reddy in Hyderabad's Care Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X