కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియా గాంధీ ఇలా వచ్చి అలా వెళ్లారు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆమె కరీంనగర్ బహిరంగ సభ నిస్సారంగా సాగినట్లు కనపించింది. ఆమె ఇలా వచ్చి నాలుగు మాటలు చెప్పేసి అలా వెళ్లిపోయారు. ఆమె ప్రసంగం కూడా క్లుప్తంగా సాగింది. పెద్దగా ప్రత్యర్థులపై వాగ్బాణాలు లేవు.

తెలంగాణ తామే ఇచ్చామని చెప్పిన సోనియా గాంధీ ఆ సందేశం ప్రజల్లోకి వెళ్లే విధంగా ధాటిగా మాట్లాడలేకపోయారు. చివరి వరకు బిజెపి తెలంగాణ బిల్లు అడ్డుకోవడానికి ప్రయత్నించిందని విమర్శించారు. తెలుగుదేశం, వైయస్సార్ కాగ్రెసు పార్టీలను తప్పు పట్టినప్పటికీ ధాటిగా తిప్పికొట్టిలేకోపయారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పై ఆమె పెద్దగా వాగ్బాణాలు సంధించలేకపోయారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంలో తెరాస పాత్ర లేదని అంటూ తెరాసను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

సోనియా అభివాదం..

సోనియా అభివాదం..

కరీంనగర్ బహిరంగ సభ వేదిక మీది నుంచి సోనియా గాంధీ ప్రజలకు అభివాదం చేస్తూ ఇలా కనిపించారు.

సోనియా అలా నమస్కారం..

సోనియా అలా నమస్కారం..

తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ కరీంనగర్ బహిరంగ సభ వేదిక మీంచి ఇలా నమస్కారం పెట్టి, మద్దతు ఇవ్వాలని కోరారు.

సోనియాతో పొన్నాల..

సోనియాతో పొన్నాల..

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సోనియా గాంధీకి పూలమాల సమర్పించి, ఇలా దండం పెడుతూ కనిపించారు.

సోనియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి...

సోనియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి...

తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి నమస్కారం చేస్తూ ఇలా కనిపించారు.

పొన్నాల లక్ష్మయ్య ఇలా..

పొన్నాల లక్ష్మయ్య ఇలా..

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సోనియా గాంధీకి స్వాగతం చెప్పారు. ఆయన నేతలను సోనియాకు పరిచయం చేశారు.

హిందీలో ప్రసంగం..

హిందీలో ప్రసంగం..

సోనియా గాంధీ కరీంనగర్ బహిరంగ సభలో హిందీలో ప్రసంగం చేశారు. దానికి అనువాదం ఏదీ జరగలేదు.

ప్రసంగం ముగిసిన తర్వాత..

ప్రసంగం ముగిసిన తర్వాత..

ప్రసంగం ముగిసిన తర్వాత వేదిక దిగిపోతూ ప్రజలకు సోనియా గాంధీ అభివాదం చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని సోనియా అన్నారు.

English summary
AICC president Sonia Gandhi Karimnagar public meeting has ended with no impact. Her speech was not effective.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X