విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ తీరంలో ఒడ్డుకొచ్చిన గణేష్ విగ్రహాలు (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నగరంలో మూడో రోజు నుంచే వినాయక నిమజ్జన వేడుకలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితి మూడో రోజైన ఆదివారం ఆర్‌కె బీచ్ వద్ద నిమజ్జనం చేసిన విగ్రహాల్లో రసాయనాలతో రూపొందించిన బొమ్మలన్నీ దాదాపుగా యథావిధిగా తీరానికి కొట్టుకొచ్చాయి.

మట్టితో చేసిన విగ్రహాలన్నీ సముద్రంలో కరిగిపోయాయి. తయారీదారులు వినియోగించిన గడ్డి మాత్రమే తీరానికి చేరింది. నవరాత్రుల్లో జరిగే నిమజ్జనోత్సవాల్లో ఇంకెన్ని విగ్రహాలు ఇలా తీరంలో నిలిచిపోతాయోనని అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. కాగా, రసాయన కారకాలను విగ్రహాల తయారీలో వినియోగించడం వల్ల సముద్ర తీరంలోని ఇసుక రంగు కూడా మారింది.

కాగా, గోకుల్ పార్కు, ఆర్‌కె బీచ్, పాండురంగాపురం తదితర ప్రాంతాల నుంచి 9 లారీల విగ్రహ శకలాలు, పూజా వ్యర్థాలను జివిఎంసి అధికారులు సేకరించారు. సుమారు 40 మంది పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటుచేసినట్లు జోన్-2 హెల్త్ ఆఫీసర్ దవళ భాస్కర్ రావు తెలిపారు. ఎప్పటికప్పుడు పూజా వ్యర్థాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

విశాఖ తీరం

విశాఖ తీరం

నగరంలో మూడో రోజు నుంచే వినాయక నిమజ్జన వేడుకలు ప్రారంభమయ్యాయి.

విశాఖ తీరం

విశాఖ తీరం

వినాయక చవితి మూడో రోజైన ఆదివారం ఆర్‌కె బీచ్ వద్ద నిమజ్జనం చేసిన విగ్రహాల్లో రసాయనాలతో రూపొందించిన బొమ్మలన్నీ దాదాపుగా యథావిధిగా తీరానికి కొట్టుకొచ్చాయి.

విశాఖ తీరం

విశాఖ తీరం

మట్టితో చేసిన విగ్రహాలన్నీ సముద్రంలో కరిగిపోయాయి. తయారీదారులు వినియోగించిన గడ్డి మాత్రమే తీరానికి చేరింది.

విశాఖ తీరం

విశాఖ తీరం

నవరాత్రుల్లో జరిగే నిమజ్జనోత్సవాల్లో ఇంకెన్ని విగ్రహాలు ఇలా తీరంలో నిలిచిపోతాయోనని అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.

విశాఖ తీరం

విశాఖ తీరం

కాగా, రసాయన కారకాలను విగ్రహాల తయారీలో వినియోగించడం వల్ల సముద్ర తీరంలోని ఇసుక రంగు కూడా మారింది.

విశాఖ తీరం

విశాఖ తీరం

గోకుల్ పార్కు, ఆర్‌కె బీచ్, పాండురంగాపురం తదితర ప్రాంతాల నుంచి 9 లారీల విగ్రహ శకలాలు, పూజా వ్యర్థాలను జివిఎంసి అధికారులు సేకరించారు.

విశాఖ తీరం

విశాఖ తీరం

సుమారు 40 మంది పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటుచేసినట్లు జోన్-2 హెల్త్ ఆఫీసర్ దవళ భాస్కర్ రావు తెలిపారు.

విశాఖ తీరం

విశాఖ తీరం

ఎప్పటికప్పుడు పూజా వ్యర్థాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెప్పారు.

English summary
Statues and Pooja items are swept at Visakhapatnam sea coast on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X