వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోలీలో అపశ్రుతులు: నీట మునిగి టెక్కీ విద్యార్థి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

student techie drowns in dam
హైదరాబాద్: హోలీ వేడుకల్లో అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. సోమవారం హోలీ ఆడి స్నానానికి దిగి వేర్వేరు ప్రాంతాల్లో పలువురు మృతి చెందగా మరో ఐదుగురు గల్లంతయ్యారు. హైదరాబాదులో ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థి నీటిలో మునిగి చనిపోయాడు. రాజు (18) తన ముగ్గురు స్నేహితులతో కలిసి హోలీ ఆడిన అనంతరం స్నానం చేసేందుకు అబ్దుల్లామెట్ పరిధిలో గల డ్యాం వద్ద ఈత కొట్టేందుకు వెళ్లారు.

ఈత కొట్టేందుకు రాజు నీటిలోకి దిగాడు. కొంతదూరం వెళ్లాక అతను నీటిలో మునిగాడు. వారి ముగ్గురు స్నేహితులు అతనిని కాపాడలేకపోయారు. రాజు కాళ్లు నీటిలో దేనికైనా తట్టుకొని మునిగిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంక అరుంధతీపేటకు చెందిన విద్యార్థులు హోలీ ఆడి వైనతేయ నదిలో దిగారు. ఆకుమర్తి రాజేష్, ఆకుమర్తి రాజేష్ బాబులు ప్రమాదవశాత్తు మునిగి మరణించారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారానికి చెందిన కురెందుల వినయ్ చందర్(21) హోలీ ఆడి స్నానానికి వెళ్లి దయ్యాలవాగులోపడి మృతి చెందాడు.

నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన లింగంపల్లి కృష్ణయ్య చిన్న కుమారుడు లింగంపల్లి గిరి(14) హోలీ ఆడి స్నానం చేసేందుకు పర్వత్‌రావు చెరువులోదిగి మునిగి మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన మామిండ్ల రాహుల్(19) గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లి నీటిలోమునిగి మృతి చెందాడు.

ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామానికి చెందిన కదం రాజు (19) గండిచెరువు చెక్‌డ్యాంలో దిగి ఈతరాక మునిగి మృతిచెందాడు. జైనూర్ మండలం సుకుడ్‌పల్లికి చెందిన మెస్రం శేకు (15) హోలీ ఆడి స్నానానికి బావిలో దిగి మునిగి చనిపోయాడు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ్థ కె.మునివంశీకృష్ణ (19) తిరుపతిలోని బావిలో పడి మునిగి చనిపోయాడు.

కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం బేగంపేట, నాగేపల్లికి చెందిన 15 మంది యువకులు హోలీ వేడుకల ఆనంతరం మంథని గోదావరిలో స్నానం చేయడానికి వచ్చారు. నదిలో ఉన్న నీటిలోయలోకి నలుగురు యువకులు జారిపడ్డారు. అక్కడున్న వారు ఇద్దర్ని రక్షించగా మరో ఇద్దరు గల్లంతయ్యారు.

English summary
The Holi celebrations of four students of a Engneering College ended in tragedy as one of them drowned in a dam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X