విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గంటా ఇంటి వద్ద విద్యార్థుల ధర్నా: ఈడ్చేశారు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల వాపస్‌పై వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఏబివిపి నేతృత్వంలో విద్యార్థులు ఎంవిపి కాలనీలో ఉన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడింంచారు. అనంతరం ఆయన ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఎంవిపి జోన్ పోలీసులు విద్యార్థులను అక్కడి నుంచి చెదరగొట్టారు. కొందర్నీ అక్కడ్నుంచి ఈడ్చుకెళ్లారు.

అనంతరం ఎంవిపి జోన్ పోలీసులు విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా ఏబివిపి జిల్లా కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఫీజుల విషయమై స్పష్టత లేకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.

రాష్ట్రంలో ఎంసెట్, లాసెట్, ఐసెట్, ఎడ్ సెట్, డైట్ సెట్ కౌన్సెలింగ్ తేదీలను వెంటనే ప్రకటించాలని కోరారు. ఇప్పటివరకు తేదీలు ప్రకటించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

విద్యార్థుల ఆందోళన

విద్యార్థుల ఆందోళన

రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల వాపస్‌పై వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఏబివిపి నేతృత్వంలో విద్యార్థులు ఎంవిపి కాలనీలో ఉన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడింంచారు.

విద్యార్థుల ఆందోళన

విద్యార్థుల ఆందోళన

అనంతరం ఆయన ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

విద్యార్థుల ఆందోళన

విద్యార్థుల ఆందోళన

దీంతో ఎంవిపి జోన్ పోలీసులు విద్యార్థులను అక్కడి నుంచి చెదరగొట్టారు. కొందర్నీ అక్కడ్నుంచి ఈడ్చుకెళ్లారు.

విద్యార్థుల ఆందోళన

విద్యార్థుల ఆందోళన

ఈ సందర్భంగా ఏబివిపి జిల్లా కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఫీజుల విషయమై స్పష్టత లేకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.

విద్యార్థుల ఆందోళన

విద్యార్థుల ఆందోళన

రాష్ట్రంలో ఎంసెట్, లాసెట్, ఐసెట్, ఎడ్ సెట్, డైట్ సెట్ కౌన్సెలింగ్ తేదీలను వెంటనే ప్రకటించాలని కోరారు.

విద్యార్థుల ఆందోళన

విద్యార్థుల ఆందోళన

ఇప్పటివరకు తేదీలు ప్రకటించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.

విద్యార్థుల ఆందోళన

విద్యార్థుల ఆందోళన

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాధవ్ తోపాటు జిల్లా కన్వీనర్ వాసు, నాయకులు జయచంద్ర, వంశీయాదవ్, రాకేష్, దామోదర గుప్తా, జగదీష్, దుర్గా ప్రసాద్, మూర్తి, శేఖర్, పెంచలయ్య, అవినాశ్, విద్యార్థులు పాల్గొన్నారు.

English summary
Students protest infront of Ganta Srinivas house in Visakhapatnam on Tuesday for fees issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X