వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు ఎంపీ అభ్యర్థులు: సబిత తనయుడు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెసు అధిష్టానం శాసనసభ టికెట్ నిరాకరించింది. దానికితోడు, ఆమె గాలి జనార్దన్ రెడ్డి ఒఎంసి కేసులో నిందితురాలిగా మారి, చిక్కుల్లో పడ్డారు. అయితే, కుమారుడు కార్తిక్ రెడ్డికి చేవెళ్ల శాసనసభ టికెట్ దక్కింది. అది ఆమెకు కొంత మేరకు ఊరట.

గత ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేసి విజయం సాధించిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ఈసారి మహబూబ్‌నగర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తెలంగాణలోని సిట్టింగ్ పార్లమెంటు సభ్యులకు దాదాపుగా టికెట్లు ఖరారయ్యాయి.

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నా లక్ష్మయ్య నుంచి లోకసభ కాంగ్రెసు అభ్యర్థులు మంగళవారం బీ ఫారాలు తీసుకున్నారు. తెలంగాణలో 17 లోకసభ స్థానాలున్నాయి.

సబిత తనయుడు కార్తిక్ రెడ్డి..

సబిత తనయుడు కార్తిక్ రెడ్డి..

చేవెళ్ల లోకసభ స్థానం నుంచి మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన పొన్నాల నుంచి బీ ఫారం అందుకున్నారు.

బీ ఫారాలు తీసుకున్న ఎంపి అభ్యర్థులు

బీ ఫారాలు తీసుకున్న ఎంపి అభ్యర్థులు

భువనగిరి లోకసభ టికెట్ తిరిగి సొంతం చేసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తదితరులు బీ ఫారాలు తీసుకున్న తర్వాత ఇలా కనిపించారు.

బలరాం నాయక్ ఇలా..

బలరాం నాయక్ ఇలా..

మహబూబాబాద్ లోకసభ స్థానం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా తిరిగి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి బలరాం నాయక్ పొన్నాల నుంచి బీ ఫారం అందుకున్నారు.

పొన్నం ప్రభాకర్ ఇలా..

పొన్నం ప్రభాకర్ ఇలా..

కరీంనగర్ లోకసభ స్థానం నుంచి తిరిగి పోటీ చేస్తున్న పొన్నం ప్రభాకర్ పొన్నాల లక్ష్మయ్య నుంచి బీ ఫారం అందుకున్నారు.

English summary
Congress Telangana Lok Sabha candidates have been distributed B - forms by TPCC president Ponnala Lakshamaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X