హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌తో తలసాని భేటీ: కాలనీకి తీసుకెళ్లారు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సనత్‌నగర్‌ నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సోమవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తనతోపాటు తన నియోజకవర్గం పరిధిలోని ఐడీహెచ్‌కాలనీకి చెందిన కొంతమందిని తీసుకువచ్చారు. క్యాంపు కార్యాలయంలో అరగంటపాటు సిఎం కెసిఆర్‌తో భేటీ అయ్యారు.

తన నియోజకవర్గంలోని ఐడీహెచ్‌ కాలనీలోని బలహీన వర్గాల గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి స్థానంలో కొత్తగా గృహ నిర్మాణం చేపట్టాలని కోరడానికే సీఎంను కలిసేందుకు వచ్చినట్టు తలసాని తెలిపారు. తలసాని కేసీఆర్‌ను కలిసేందుకు రావడం టీఆర్‌ఎస్‌, తెలుగుదేశం పార్టీలోనూ చర్చనీయాంశమైంది. కొంతకాలంగా ఆయన టిఆర్‌ఎస్‌లో చేరతారని వస్తున్న ప్రచారానికి సోమవారం సీఎంతో జరిగిన భేటీ ఊతమిస్తోందని అంటున్నారు.

టిఆర్‌ఎస్‌ వర్గాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ తలసాని టిఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సిఎం కేసీఆర్‌ తలసాని విజ్ఞప్తి మేరకు సోమవారం సాయంత్రమే ఐడిహెచ్‌ కాలనీలో పర్యటించడం, ఈ కాలనీలో దాదాపు 250 మందికి గృహనిర్మాణాలు ఏ విధమైన మార్జిన్‌ మనీ లేకుండా నిర్మించి ఇస్తామని ప్రకటించడంపై కూడా టిఆర్‌ఎస్‌ వర్గాల్లో సానుకూల సంకేతాలుగా చర్చించుకుంటున్నారు.

కెసిఆర్‌తో తలసాని

కెసిఆర్‌తో తలసాని

సనత్‌నగర్‌ నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సోమవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు.

కెసిఆర్‌తో తలసాని

కెసిఆర్‌తో తలసాని

తనతోపాటు తన నియోజకవర్గం పరిధిలోని ఐడీహెచ్‌కాలనీకి చెందిన కొంతమందిని తీసుకువచ్చారు. క్యాంపు కార్యాలయంలో అరగంటపాటు సిఎం కెసిఆర్‌తో భేటీ అయ్యారు.

కెసిఆర్‌తో తలసాని

కెసిఆర్‌తో తలసాని

తన నియోజకవర్గంలోని ఐడీహెచ్‌ కాలనీలోని బలహీన వర్గాల గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి స్థానంలో కొత్తగా గృహ నిర్మాణం చేపట్టాలని కోరడానికే సీఎంను కలిసేందుకు వచ్చినట్టు తలసాని తెలిపారు.

కెసిఆర్‌తో తలసాని

కెసిఆర్‌తో తలసాని

తలసాని కేసీఆర్‌ను కలిసేందుకు రావడం టీఆర్‌ఎస్‌, తెలుగుదేశం పార్టీలోనూ చర్చనీయాంశమైంది. కొంతకాలంగా ఆయన టిఆర్‌ఎస్‌లో చేరతారని వస్తున్న ప్రచారానికి సోమవారం సీఎంతో జరిగిన భేటీ ఊతమిస్తోందని అంటున్నారు.

కెసిఆర్‌తో తలసాని

కెసిఆర్‌తో తలసాని

సిఎం కేసీఆర్‌ తలసాని విజ్ఞప్తి మేరకు సోమవారం సాయంత్రమే ఐడిహెచ్‌ కాలనీలో పర్యటించడం, ఈ కాలనీలో దాదాపు 250 మందికి గృహనిర్మాణాలు ఏ విధమైన మార్జిన్‌ మనీ లేకుండా నిర్మించి ఇస్తామని ప్రకటించడంపై కూడా టిఆర్‌ఎస్‌ వర్గాల్లో సానుకూల సంకేతాలుగా చర్చించుకుంటున్నారు.

తెలంగాణ పర్యాటక లోగో

తెలంగాణ పర్యాటక లోగో

తెలంగాణ పర్యాటక శాఖ కొత్త లోగోను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.

English summary

 Sanathnagar Telugudesam Party MLA Talasani Srinivas Yadav on Monday met Telangana CM K Chandrasekhar Rao at his camp office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X