వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నందిగామ తొలి మహిళా ఎమ్మెల్యే ప్రమాణం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: శాసనసభలో నందిగామ నియోజకవర్గ తొలి మహిళ శాసనసభ్యురాలుగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజా ర్టీతో గెలుపొందిన తంగిరాల సౌమ్య బుదవారం నాడు స్పీకర్‌ కోడెల శివ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేశారు.

నందిగామ నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళాభ్యర్దిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందిన స్వర్గీయ తంగిరాల ప్రభాకరరావు కూతురు తంగి రాల సౌమ్య బుదవారంనాడు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామాత్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, జగ్గయ్య పేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్‌ (తాతయ్య) వెంట రాగా అసెంబ్లీలోని స్పీకర్‌ ఛాంబర్‌లో ప్రమాణస్వీకారం చేశారు.

నియోజకవర్గ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటా నని,రాష్ట్ర అభివృద్దితోపాటు నియోజకవర్గ అభివృద్ది జరిగేందుకు అహర్నిశలు శ్రమిస్తానని ఆమె ప్రమాణ స్వీకారానంతరం మీడియాతో అన్నారు. స్వర్గీయ దేవినేని వెంటకరమణ, తంగిరాల ప్రభాకరరావు కన్నకలలను దేవినేని ఉమామహేశ్వరరావు సహకారంతో సాధిస్తానని, నియోజకవర్గాన్ని అభివృద్దిపధంలో ముందుండే విధంగా చూసుకుంటామని తెలిపారు.

సౌమ్య ప్రమాణం

సౌమ్య ప్రమాణం

నందిగామ నుంచి శాసనసభకు భారీ మెజారిటీతో విజయం సాధించిన తంగిరాల సౌమ్య బుధవారంనాడు శాసనసభ్యురాలిగా ప్రమాణం చేశారు.

సౌమ్య ప్రమాణం

సౌమ్య ప్రమాణం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు ఆమెతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ ఆమె విజయం సాధించిన విషయం తెలిసిందే.

తంగిరాల ప్రమాణం

తంగిరాల ప్రమాణం

నందిగామ నుంచి ఘన విజయం సాధించిన తంగిరాల సౌమ్య శాసనసభ్యురాలిగా బుధవారం ప్రమాణం చేశారు. చిత్రంలో కాల్వ శ్రీనివాసులును కూడా చూడవచ్చు.

తంగిరాల సౌమ్య ప్రమాణం

తంగిరాల సౌమ్య ప్రమాణం

తన తండ్రి తంగిరాల ప్రభాకర రావు మరణంతో ఖాళీ అయిన నందిగామ శాసనసభ సీటు నుంచి పోటీ చేసి తంగిరాల సౌమ్య విజయం సాధించారు.

సౌమ్య ప్రమాణం

సౌమ్య ప్రమాణం

తంగిరాల సౌమ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, కాల్వ శ్రీనివాసులు, తదితరులు వచ్చారు.

English summary
Tangirala Sowmya,MLA,Nandigama Constituency took oath in the presence of Kodela shiva Prasad Rao, Speaker Andhra Pradesh Assembly at his chamber
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X