వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యాయం జరగలేదు కానీ: బడ్జెట్‌పై టీడీపీ, రాజధానిపై..

By Srinivas
|
Google Oneindia TeluguNews

TDP happy with budget
హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సర్దుబాటు బడ్జెట్ అని ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అన్నారు. వ్యవస్థను గాడిలో పెట్టడంలో భాగంగా చేసిన ప్రయత్నమే ఇది అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఈ బడ్జెట్ కేటాయింపులు సరిపోవన్నారు. కేంద్ర బడ్జెట్‌‍లో రాష్ట్రానికి ఆశించిన న్యాయం జరగలేదన్నారు.

బడ్జెట్ పైన టీడీపీ ఎంపీలు

కేంద్ర బడ్జెట్‌ను టీడీపీ ఎంపీలు స్వాగతించారు. పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయిందని, ఆ తుప్పును వదిలించే ప్రయత్నం ఎన్డీయే చేస్తోందన్నారు. రాజధాని విషయంలో కమిటీ నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు. ఆదాయ పరిమితి ఆశించిన స్థాయిలో పెంచలేదని చెప్పారు. అయినా అన్నీ ఒకేసారి సాధ్యం కాదని చెప్పారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఉపయోగపడుతుందన్నారు. ఈ బడ్జెట్‌ను ప్రతి రంగం తమ బడ్జెట్‌గా భావించే అవకాశముందన్నారు.

సమస్యలు చర్చించుకుంటాం: పల్లె

ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని, దాని కోసం ప్రయత్నాలు చేస్తామని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వేరుగా అన్నారు. వ్యవసాయంలో సంస్కరణలు చేస్తామన్నారు. రైతులకు ఉచితంగా కొత్త పంపుసెట్లు ఇస్తామన్నారు. ట్రాన్సుఫార్మర్లు కాలిపోతే 24 గంటల్లో మరమ్మతు చేస్తామన్నారు. పొరుగు సేవల ద్వారా ఎంపీవోల నియామకం ఉంటుందన్నారు. ప్రతి వెయ్యి మంది ఎంపీవోలకు రైతుమిత్ర గ్రూపులను ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రతి శాఖలో, సేవలో ఐటి సేవలు అమలు చేస్తామన్నారు. అక్షరాస్యతను వంద శాతానికి పెంచే కృషి చేస్తామన్నారు. నీటి సంరక్షణకు క్షేత్రస్థాయి నుండి కృషి చేస్తామన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ త్వరగా జరపాలని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని తెలంగాణ సీఎంకు లేఖ రాస్తామన్నారు. బోధనా సమస్యలు ఉంటే తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పారు.

English summary
Telugudesam Party happy with budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X