హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదీ ప్లాన్!: రేవంత్‌పై కర్నె, లంచం అడగమని కేసీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

TDP leaders blaming TRS government for AP: Karne
హైదరాబాద్/మహబూబ్ నగర్/విశాఖ: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కర్నె ప్రభాకర్ గురువారం నిప్పులు చెరిగారు. రేవంత్ ఆంధ్రాకు బ్రోకర్‌గా మారారని విమర్శించారు. ఆంధ్రాకు బ్రోకర్‌గా మారిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నమ్మరన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగితే ఆంధ్రాకు పెట్టుబడులు రావనే తమ పైన విమర్శలు చేస్తోందన్నారు.

రూపాయి లంచం అడగం: కేసీఆర్

వచ్చే జూన్ కల్లా కల్వకుర్తి-నెట్టెంపాడు ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహబూబ్ నగర్ జిల్లాలో అన్నారు. పాలమూరు జిల్లాలో 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. వారిని తాము ఒక్కరూపాయి లంచం అడగమన్నారు. అధికారులు వారిని ఇబ్బంది పెట్టవద్దని సూచించారు.

ప్రైవేటు మెడికల్ కళాశాలలకు సుప్రీంకోర్టులో ఊరట

ప్రైవేటు మెడికల్ కళాశాలలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) అనుమతి రద్దు చేసిన కాలేజీల రెన్యువల్‌కు కోర్టు అవకాశం ఇచ్చింది. కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి మార్గం సుగమమైంది. నిబంధనల ప్రకారం కళాశాలల్లో పది రోజుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.

సదుపాయాలు మెరుగుపరిచాక లిఖితపూర్వక హామీ ఇవ్వాలని ఆదేశించింది. అంతేగాక రూ.10 కోట్ల బ్యాంకు గ్యారెంటీ సమర్పించాలని కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సదుపాయాలు మెరుగుపరచకపోతే బ్యాంకు గ్యారెంటీని జప్తు చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 1000 మెడికల్ సీట్లు పెరగనున్నాయి.

English summary

 Telugudesam Party leaders blaming TRS government for Andhra Pradesh, says Karne Prabhakar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X