హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసభ్యసందేశాలతో టెక్కీ యువతికి వేధింపు, వ్యక్తి అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తనతో మాట్లాడటం మానేసిందనే కారణంతో అసభ్య సందేశాలు, ఈమెయిల్స్ పంపడమే కాకుండా ఫోన్ చేసి తోటి ఉద్యోగిని వేధిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చింతల్ ప్రాంతంలో నివసించే మురళీధర్ మాదాపూర్‌లోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో పని చేస్తున్నాడు.

అదే సంస్థలో పని చేసే ఉద్యోగినితో అతనికి స్నేహం ఏర్పడింది. వారి మధ్య విభేదాలు రావడంతో ఆమె అతడితో మాట్లాడటం మానేసింది. దీంతో ఆమెకు అసభ్యకర సందేశాలు పంపించడంతో పాటు ఫోన్ చేసి వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, శనివారం అతనిని అరెస్టు చేశారు.

Techie arrested for harassing woman

సాఫ్టువేర్ ఇంజనీర్ ఆత్మహత్య

వివాహం చేసుకోవడం ఇష్టం లేని ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువతి మాదాపూర్‌లోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో పని చేస్తోంది.

వచ్చే నెలలోనే పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆమెకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తల్లిదండ్రులు చెప్పినా వినక పోవడంతో మనస్తాపానికి గురైన ఆమె శనివారం రాత్రి ఇంట్లోని బాత్‌రూంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

English summary
Techie arrested for harassing woman in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X