వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘన స్వాగతం: సింగపూర్‌లో బిజీగా కెసిఆర్ (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సింగపూర్‌కు బుధవారం ఉదయం చేరుకున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు బిజీ బిజీగా గడిపారు. సింగపూర్‌లోని రిట్జ్ కార్టన్ హోటల్ వద్ద కెసిఆర్‌కు ఐఐఎం పూర్వ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఐఐఎం పూర్వ విద్యార్థులు గురువారం కార్యక్రమం నిర్వహించనున్న స్టేడియాన్ని కెసిఆర్ సందర్శించారు.

శుక్రవారం ఉదయం 11 గంటలకు సింగపూర్ హైకమిషర్‌తో కెసిఆర్ భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు విదేశాంగ మంత్రితో సమావేశమై అక్కడ అమలు చేస్తున్న పారిశ్రామిక విధానంపై కెసిఆర్ చర్చించనున్నారు. అనంతరం జెటిసిలో జరుగబోయే ఇంఫాక్ట్ సదస్సులో కెసిఆర్ పాల్గొంటారు.

మరుసటి రోజు 23న ఉదయం సింగపూర్ నుంచి కెసిఆర్ కౌలాలంపూర్‌కు చేరుకుంటారు. ఆ రోజు అక్కడే ఉండి 24వ తేదీ రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

ముఖ్యమంత్రి వెంట ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, పరిశ్రమలశాఖ కమిషనర్ జయేష్ రంజన్, ఐటీశాఖ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్, ముఖ్యమంత్రి అదనపుకార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

సింగపూర్‌లో కెసిఆర్

సింగపూర్‌లో కెసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తొలి రోజు సింగపూర్ పర్యటనలో బిజీగా గడిపారు. బుధవారం ఉదయం ఆయన సింగపూర్‌కు చేరుకున్నారు.

సింగపూర్‌లో కెసిఆర్

సింగపూర్‌లో కెసిఆర్

సింగపూర్ పారిశ్రామిక విధానంపై కె. చంద్రశేఖర రావు ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఆయన మలేషియా అభివృద్ధి నమూనాను పరిశీలించనున్నారు.

సింగపూర్‌లో కెసిఆర్

సింగపూర్‌లో కెసిఆర్

భారతదేశం నుంచి కెసిఆర్ ఒక్కరికే సింగపూర్ నుంచి ఆహ్వానం వచ్చింది. కొత్త రాష్ట్రం, కొత్త ముఖ్యమంత్రి కావడంతో ఈ ఆహ్వానం లభించింది.

సింగపూర్‌లో కెసిఆర్

సింగపూర్‌లో కెసిఆర్

మలేషియా అభివృద్ధిపై కెసిఆర్‌కు ప్రధానంగా ఆకర్షణ ఉంది. మలేషియా పద్ధతిలో తెలంగాణను అభివృద్ధి చేయవచ్చుననేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది.

English summary
Telangana CM K Chandrasekhar Rao was busy in Singapore on his first day of the visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X