వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వదిలిపెట్టను: కెసిఆర్, మొక్కకు నీళ్లుపోసి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్: రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే అద్బుతమని, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పరిశ్రమల ఏర్పాటు విధానానికి దేశ, విదేశాల వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను ఆకర్షించామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం వేముల గ్రామ సమీపంలోని కోజెంట్ గ్లాస్ కంపెనీతోపాటు కొత్తూరు మండలం పింజర్ల గ్రామ సమీపంలో ప్రొక్టర్ అండ్ గ్రాంబుల్ కంపెనీలను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు. అదేవిధంగా పింజర్ల గ్రామంలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా కెసిఆర్ మాట్లాడుతూ.. పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కంపెనీల ఏర్పాటు కోసం గతంలో మాదిరిగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం పెట్టుబడిదారులకు లేకుండా తానే అనుమతులను స్వయంగా పరిశీలిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహాయ, సహకారం అందిస్తుందని, సంబంధిత శాఖల నుండి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని అన్నారు. కోజెంట్ కంపెనీ ఏర్పాటు సమయంలో ఆర్‌అండ్‌బి అధికారులు చాలా ఇబ్బందులు పెట్టారని తనకు సమాచారం ఉందని, ఇక రాబోయే కాలంలో ఇబ్బందులు ఉండబోవన్నారు. ఇబ్బందులు పెట్టిన ఆర్‌అండ్‌బి అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులను వదిలిపెట్టనని, ఈ విషయంపై మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని సూచించారు.

పరిశ్రమల ఏర్పాటు కోసం పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చి దరఖాస్తులు చేసుకుంటే 15 రోజుల్లో అన్నీ అనుమతులు ప్రభుత్వం ఇస్తుందని కెసిఆర్ భరోసా ఇచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు దగ్గర ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ పరిశ్రమల కార్యదర్శితో పాటు సంబంధిత శాఖల అధికారులు ఉంటారని, తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ పరిశ్రమలు స్థాపించడానికి విదేశాల నుండి వచ్చే పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహాయ, సహకారం అందిస్తుందని, సంబంధిత శాఖల నుండి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని అన్నారు.

కొత్తూరుతో పాటు జాతీయ రహదారి ఇరువైపుల పారిశ్రామిక కారిడార్‌గా అద్బుతమైన అవకాశం ఉందని, ఎయిర్‌పోర్టు దగ్గర ఉన్నందున వివిధ దేశాల పెట్టుబడిదారులు మహబూబ్‌నగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని తెలిపారు.

ప్రొక్టర్ అండ్ గ్రాంబుల్ కంపెనీ

ప్రొక్టర్ అండ్ గ్రాంబుల్ కంపెనీ

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పింజర్ల గ్రామ సమీపంలో ప్రొక్టర్ అండ్ గ్రాంబుల్ కంపెనీని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు.

కెసిఆర్

కెసిఆర్

రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే అద్బుతమని, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పరిశ్రమల ఏర్పాటు విధానానికి దేశ, విదేశాల వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను ఆకర్షించామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం వేముల గ్రామ సమీపంలోని కోజెంట్ గ్లాస్ కంపెనీతోపాటు కొత్తూరు మండలం పింజర్ల గ్రామ సమీపంలో ప్రొక్టర్ అండ్ గ్రాంబుల్ కంపెనీలను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు.

కెసిఆర్

కెసిఆర్

అదేవిధంగా పింజర్ల గ్రామంలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

కెసిఆర్

కెసిఆర్

పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కంపెనీల ఏర్పాటు కోసం గతంలో మాదిరిగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం పెట్టుబడిదారులకు లేకుండా తానే అనుమతులను స్వయంగా పరిశీలిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ఇప్పటికే ప్రకటించామని, ప్రపంచ దేశాల పెట్టుబడిదారులను ఇది ఆకర్షించిందని అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కంపెనీల ఏర్పాటు కోసం గతంలో మాదిరిగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం పెట్టుబడిదారులకు లేకుండా తానే అనుమతులను స్వయంగా పరిశీలిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు.

కెసిఆర్

కెసిఆర్

పరిశ్రమల ఏర్పాటు కోసం పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చి దరఖాస్తులు చేసుకుంటే 15 రోజుల్లో అన్నీ అనుమతులు ప్రభుత్వం ఇస్తుందని కెసిఆర్ భరోసా ఇచ్చారు.

కెసిఆర్

కెసిఆర్

శంషాబాద్ ఎయిర్‌పోర్టు దగ్గర ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ పరిశ్రమల కార్యదర్శితో పాటు సంబంధిత శాఖల అధికారులు ఉంటారని తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ పరిశ్రమలు స్థాపించడానికి విదేశాల నుండి వచ్చే పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహాయ, సహకారం అందిస్తుందని, సంబంధిత శాఖల నుండి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

కోజెంట్ కంపెనీ ఏర్పాటు సమయంలో ఆర్‌అండ్‌బి అధికారులు చాలా ఇబ్బందులు పెట్టారని తనకు సమాచారం ఉందని, ఇక రాబోయే కాలంలో ఇబ్బందులు ఉండబోవన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ప్రస్తుతం రూ. 200 కోట్ల నుండి రూ. 300 కోట్లతో కోజెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఈ కంపెనీలో 70శాతం స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు.

కెసిఆర్

కెసిఆర్

కొత్తూరుతో పాటు జాతీయ రహదారి ఇరువైపుల పారిశ్రామిక కారిడార్‌గా అద్బుతమైన అవకాశం ఉందని, ఎయిర్‌పోర్టు దగ్గర ఉన్నందున వివిధ దేశాల పెట్టుబడిదారులు మహబూబ్‌నగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని తెలిపారు.

జాన్సన్ అండ్ జాన్సన్ ప్లాంట్ ఫౌండేషన్

జాన్సన్ అండ్ జాన్సన్ ప్లాంట్ ఫౌండేషన్

అందులో భాగంగానే మల్టీనేషన్ కంపెనీలు అయిన కోజెంట్ ప్రాక్టర్ అండ్ గ్రాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి పెద్దపెద్ద పరిశ్రమలు ఇక్కడికి వచ్చాయని అన్నారు.

సింగిల్‌విండో సిస్టం

సింగిల్‌విండో సిస్టం

సింగిల్‌విండో సిస్టం ద్వారా అవినీతికి తావివ్వకుండా నూతన పాలసిని అమలు చేయబోతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

English summary
The Telangana Chief Minister K Chandrasekhar Rao today said that the new industrial policy will transform the investment climate in the new State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X