వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సానియా స్థానికతేమిటి: కెసిఆర్‌పై తెలుగు యువత

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్థానికత విషయంలో టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సంగతి ఏమిటని తెలుగు యువత ప్రశ్నించింది.1956కు ముందే తెలంగాణ ప్రాంతంలో స్థిరపడిన వారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ , సంక్షేమ పథకాలు అందుతాయని పదే పదే కెసిఆర్ చెబుతున్నారని ఆయనకు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా విషయంలో ఈ నిబంధనలు గుర్తుకురాలేదా అని తెలుగుయువత కార్యనిర్వాహణ కార్యదర్శి జిమ్మిబాబు ప్రశ్నించారు.

ఆమె తాతముత్తాతలు తెలంగాణకు చెందిన వారా అని ఫ్రశ్నించారు. సానియా మీర్జా తండ్రి తెలంగాణకు చెందిన వారు కాదని, ఆమె భర్త వేరే దేశానికి చెందిన వారని అలాంటిది ఆమెకు ఆఘమేఘాల మీద కోటి రూపాయిలు నిధులు ఏ విధంగా కేటాయించారని ప్రశ్నించారు.

Telugu yuvatha questions Sania's nativity

పిల్లలు చదువుకుంటామంటే డబ్బులు ఇవ్వరుకాని సొంతంగా అకాడమి పెట్టుకుని వ్యాపారం చేసుకునే వారికి ఏ మొహం పెట్టుకుని నిధులు కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. 1947కు ముందు తెలంగాణ ప్రత్యేక దేశమని ఎంపి కవిత చెబుతుండగా, ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తెలంగాణ బిడ్డలు పూర్ణ, ఆనంద్‌లు పనికి రాలేదా అని ప్రశ్నిచారు. తెలుగుయువత తెలుగుదేశం అనుబంధ విద్యార్థి సంఘం.

English summary
Telugu Yuvatha leader Jimmibabu questioned Telangana CM K chandrasekhar Rao about the nativity of Tennis star Sania Mirza.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X