వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గద్దర్‌పై దాడికి 17 ఏళ్లు: నారాయణమూర్తి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్‌పై దాడి జరిగిన ఏప్రిల్ 6వ తేదీతో 17 ఏళ్లు అవుతోంది. ఈ దాడి కేసులో ఏ విధమైన పురోగతి లేదు. ఈ సందర్భంగా హైదరాబాదులో ఆదివారం ఓ కార్యక్రమం ఏర్పాటైంది. ఈ కార్యక్రమంలో గద్దర్‌తో పాటు జై బోలో తెలంగాణ చిత్ర దర్శకుడు శంకర్, ప్రముఖ నటుడు ఆర్ నారాయణ మూర్తి పాల్గొన్నారు.

గద్దర్‌పై దాడి జరిగిన కేసును సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఓ కేక్‌ను కూడా కట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. గద్దర్‌కు లక్షల మందిని చైతన్యపరిచే శక్తి ఉంది కాబట్టే ఆయనపై కాల్పులకు పాల్పడ్డారని హక్కుల నేత హరగోపాల్ అన్నారు.

తెలంగాణ ప్రజలు 60 ఏళ్లు ప్రజాస్వామ్య హక్కుల కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేశారని నమస్తే తెలంగాణ సంపాదకుడు అల్లం నారాయణ అన్నారు. ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగానే ప్రజాస్వామ్యవాదులపై అణచివేత కొనసాగిందని ఆయన విమర్శించారు.

జై బోలో తెలంగాణ చిత్ర దర్శకుడు..

జై బోలో తెలంగాణ చిత్ర దర్శకుడు..

గద్దర్‌పై దాడికి నిరసనగా ఏర్పాటైన సభలో జై బోలో తెలంగాణ చిత్రం దర్శకుడు ఎన్. శంకర్ మాట్లాడారు. ఆయన ఇలా కనిపించారు.

గద్దర్ ఇలా కనిపించారు..

గద్దర్ ఇలా కనిపించారు..

తనపై దాడికి నిరసనగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్ ఇతర కళాకారులతో ఇలా కనిపించారు.

కేక్ కట్ చేశారు..

కేక్ కట్ చేశారు..

గద్గర్‌రపై జరిగిన దాడికి నిరసనగా ఏర్పాటైన కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. గద్దర్, ఆర్ నారాయణమూర్తి, శంకర్ తదితరులను చూడవచ్చు.

కేక్ తినిపించారు...

కేక్ తినిపించారు...

ప్రముఖ చలనచిత్ర నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణ మూర్తి ప్రజా గాయకుడు గద్దర్‌కు కట్ చేసిన కేక్‌ను తినిపిస్తూ ఇలా కనిపించారు.

English summary
Jai Bolo Telangana film director and actor R Narayana Murthy participated in programme held in protest against Gaddar 10 years back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X