హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జంట హత్యల కేసులో ముగ్గురు అరెస్టు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జంట హత్యల కేసులో శంషాబాద్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆర్ రాకేష్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇటీవల ఐఐఎఫ్ఎల్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ సెక్యూరిటీ గార్డును, అతని మిత్రుడిని ముగ్గురు హత్య చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి - రాకేష్ అతని మిత్రులు శ్రీరాం, వికాస్ మెహతా శంషాబాద్‌లోని ఐఐఎఫ్ఎల్ ఆవరణలోకి మార్చి 23వ తేదీన ప్రవేశించారు. షట్టర్ లాక్ పగులగొట్టి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వాచ్‌మన్ యు శంకరయ్య (56), అతని స్నేహితుడు ఎస్ జయప్ప (54) వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే, ఆ ముగ్గురు ఆ ఇద్దరిపై రాడ్స్‌తో దాడి చేశారు.

రాకేష్‌పై గతంలో కూడా ఓ కేసు ఉంది. 2009లో లాలాగుడా పోలీసు స్టేషన్‌లో అతనిపై కేసు నమోదై ఉంది. ప్రాపర్టీలు కొల్లగొట్టడానికి రాకేష్ నాలుగు నెలల క్రితం శ్రీరాం, వికాస్‌తో కలిపి ఓ ముఠాను తయారు చేశాడు. రాకేష్ ఐఐఎఫ్ఎల్ శంషాబాద్ శాఖలో రాకేష్ 2,500 రూపాయల అప్పు కూడా తీసుకున్నాడు. దాన్ని సాకుగా తీసుకుని ఆ శాఖ కార్యాలయాన్ని అతను పలుమార్లు సందర్శించాడు.

రెక్కీ నిర్వహించిన తర్వాత శ్రీరాం, వికాస్‌లతో కలిసి దోపిడీకి ప్రయత్నించాడు. వారు ముగ్గురు గ్లోజులు, మంకీ క్యాప్‌లు, కత్తి కొనుగోలు చేశారు. ఆఫీసు లోనికి వెళ్లి తాళం తీయడానికి ప్రయత్నించినప్పుడు వాచ్‌మన్, అతని మిత్రుడు అడ్డగించారు. వారిని కత్తులతో పొడిచారు. రాకేష్ శంషాబాద్‌లో మూడు దొంగతనాలకు పాల్పడినట్లు సైబరాబాద్ పోలీసు కమిషన్ సివి ఆనంద్ చెప్పారు.

మీడియా ముందుకు నిందితులు

మీడియా ముందుకు నిందితులు

జంట హత్యల కేసులో ముగ్గురు నిందితులను శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారిని సోమవారంనాడు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

హత్యల తీరును వివరించిన ఆనంద్

హత్యల తీరును వివరించిన ఆనంద్

ముగ్గురు నిందితులు ఐఐఎఫ్ఎల్ శంషాబాద్ శాఖ వాచ్‌మన్‌ను, అతని మిత్రుడిని హత్య చేసిన తీరును సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ వివరించారు.

ప్రధా నిందితుడు రాకేష్

ప్రధా నిందితుడు రాకేష్

జంట హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌పై లాలాగుడా పోలీసు స్టేషన్‌లో కూడా కేసు ఉంది. అతను శంషాబాద్‌లో మూడు దొంగతనాలకు పాల్పడినట్లు సివి ఆనంద్ చెప్పారు.

ఆర్థిక సంస్థ ఆవరణలో ఇలా..

ఆర్థిక సంస్థ ఆవరణలో ఇలా..

పోలీసులు ఐఐఎఫ్ఎల్ కార్యాలయంలోని సిసిటీవి కెమెరా ఫుటేజ్‌ని పరిశీలించినట్లు తెలుస్తోంది. మంకీ క్యాప్‌లు ధరించి నిందితులు వచ్చారు.

English summary
Shamshabad police arrested three persons, including the prime accused R Rakesh for the recent double murder of IIFL private finance company's security guard and his friend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X