చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోహినీ అవతారంలో శ్రీవారు: నృత్యాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారు మంగళవారం మోహినీ అవతారంలో తిరువీధుల్లో వూరేగారు. ఉదయం 9గంటలకు ప్రత్యేక అలంకరణతో బంగారు కిరీటాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవకు ముందు కళాకారుల కోలాటాలు, భజనలతో సందడి వాతావరణం నెలకొంది. ఒక చేతిలో అమృత కలశం, మరో చేతిలో అభయ హస్తం. మోహినీ అవతార రూపుడైన జగన్నాథుడు తిరుమాడ వీధుల్లో ఊరేగుతుంటే.. భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.

వెంకన్నను మోహినీ అవతారంలో వీక్షించేందుకు తండోపతండాలుగా కదిలివచ్చిన భక్త జనుల గోవింద నామస్మరణతో ఏడుకొండలు మారుమ్రోగాయి. మంచి పనులు చేయడం ద్వారా అనుగ్రహం ఎలా పొందవచ్చో లోకానికి చాటడం కోసమే శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరుమాడవీధుల్లో విహరించి భక్తులకు ఆనందం కలిగించారని పురోహితులు పేర్కొన్నారు.

రెండు గంటలపాటు ఉత్సవం జరిగింది. రాత్రి 8గంటలకు శ్రీవారి గరుఢోత్సవం మొదలవుతుంది. ఇతర సేవలకంటే భిన్నంగా 5గంటలపాటు గరుఢ వాహనంపై శ్రీవారు వూరేగనున్నారు. గరుఢ వాహన సేవలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే తిరుమల చేరుకున్నారు.

యువతుల నృత్యాలు

యువతుల నృత్యాలు

బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరువీధుల్లో శ్రీవారు ఊరేగుతుంటే.. పలువురు యువతులు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు.

దేవతల వేషాధారణలో..

దేవతల వేషాధారణలో..

బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరువీధుల్లో శ్రీవారు ఊరేగుతుండగా.. పలువురు చిన్నారులు దేవతల వేషాధారణలో అలరించారు.

ఆకట్టుకున్న చిన్నారులు

ఆకట్టుకున్న చిన్నారులు

బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరువీధుల్లో శ్రీవారు ఊరేగుతుండగా.. దేవతల వేషాధారణలో స్వామివారికి నమస్కరిస్తున్న చిన్నారులు.

తిరువీధుల్లో..

తిరువీధుల్లో..

బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరువీధుల్లో శ్రీవారు ఊరేగుతుండగా.. ఆకట్టుకున్న యువతుల ప్రదర్శన.

తిరువీధుల్లో

తిరువీధుల్లో

శ్రీవారి వాహన సేవకు ముందు కళాకారుల కోలాటాలు, భజనలతో సందడి వాతావరణం నెలకొంది.

కళాకారుల నృత్యాలు

కళాకారుల నృత్యాలు

శ్రీవారి వాహన సేవకు ముందు కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

కళాకారులు నృత్యాలు

కళాకారులు నృత్యాలు

శ్రీవారి వాహన సేవకు ముందు కళాకారుల కోలాటాలు, భజనలతో సందడి వాతావరణం నెలకొంది.

కళాకారుల ప్రదర్శన

కళాకారుల ప్రదర్శన

శ్రీవారి వాహన సేవకు ముందు వివిధ వేషాధారణల్లో చేసిన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

కళాకారుల ప్రదర్శన

కళాకారుల ప్రదర్శన

శ్రీవారి వాహన సేవకు ముందు వివిధ వేషాధారణల్లో చేసిన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

మోహినీ అవతారంలో..

మోహినీ అవతారంలో..

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారు మంగళవారం మోహినీ అవతారంలో తిరువీధుల్లో వూరేగారు.

మోహినీ అవతారంలో..

మోహినీ అవతారంలో..

ఉదయం 9గంటలకు ప్రత్యేక అలంకరణతో బంగారు కిరీటాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.

మోహినీ అవతారంలో..

మోహినీ అవతారంలో..

స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్ జగదీష్ చంద్రశర్మ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంజి గోపాల్, అధికారులు కెఎస్ శ్రీనివాస రాజు, పోల రాజు, సివి అండ్ ఎస్ఓ జి శ్రీనివాస్, ఏసిబిఎస్ఓ శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ చిన్నమగారి రమణ, ఆర్ సెల్వం, అజయ్, తదితరులు పాల్గొన్నారు.

మోహినీ అవతారంలో..

మోహినీ అవతారంలో..

ఒక చేతిలో అమృత కలశం, మరో చేతిలో అభయ హస్తం. మోహినీ అవతార రూపుడైన జగన్నాథుడు తిరుమాడ వీధుల్లో ఊరేగుతుంటే.. భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.

తరలివచ్చిన భక్తులు

తరలివచ్చిన భక్తులు

వెంకన్నను మోహినీ అవతారంలో వీక్షించేందుకు తండోపతండాలుగా కదిలివచ్చిన భక్త జనుల గోవింద నామస్మరణతో ఏడుకొండలు మారుమ్రోగాయి.

భక్త పారవశ్యం

భక్త పారవశ్యం

మంచి పనులు చేయడం ద్వారా అనుగ్రహం ఎలా పొందవచ్చో లోకానికి చాటడం కోసమే శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరుమాడవీధుల్లో విహరించి భక్తులకు ఆనందం కలిగించారని పురోహితులు పేర్కొన్నారు.

English summary

 Tirumala Srivaru appeared in Mohini Avataram on Tuesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X