చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గంగమ్మ జాతరలో మోహన్‌బాబు: జగన్ కోసం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు జిల్లా తిరుపతిలో వారంరోజులపాటు జరిగిన శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర బుధవారం ఉదయం వైభవంగా ముగిసింది. వారం రోజులుగా వివిధ రకాల వేషధారణలతో భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. అవిలాల గ్రామానికి చెందిన కైకాల కులస్తులు పేరంటాళ్ల వేషం ధరించి విశ్వరూపదర్శనంలో ఉన్న అమ్మవారి చెంపను నరికే ఘట్టంతో జాతర పరిసమాప్తం అయింది.

అమ్మవారి విశ్వరూపదర్శనం కోసం మంగళవారం రాత్రి నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తులు పోటెత్తారు. సప్పరాలు మోసుకుంటూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వెదురు దబ్బలతో గోపుర ఆకారంలో సప్పరాలు తయారు చేస్తారు. శరీర ఆకృతికి అనుగుణంగా తయారు చేసిన సప్పరాలను నేల వాలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాగా, చెంప నరికే కార్యక్రమం అనంతరం అమ్మవారి విగ్రహం మట్టి కోసం భక్తులు పోటీపడ్డారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తిరుగుపయనమయ్యారు.

గంగమ్మ జాతరలో పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు జాతరకు హాజరై అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం పూజాసామాగ్రితో వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రి నాయుడు, ఆయన సతీమణి దాక్షాయణి, మూడో అదనపు జిల్లా జడ్జి రవీంద్రబాబు, ఇతర న్యాయమూర్తుల బృందం అమ్మవారిని దర్శించుకుంది.

కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అమ్మవారిని దర్శించుకుని.. తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేలా ఆశీర్వదించాలని వేడుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి.. ప్రజా సంక్షేమం కోరుకునే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలని వేడుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రతిపక్షంలోనే ఉండాలని కోరుకున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు.

గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

చిత్తూరు జిల్లా తిరుపతిలో వారంరోజులపాటు జరిగిన శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర బుధవారం ఉదయం వైభవంగా ముగిసింది.

గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

వారం రోజులుగా వివిధ రకాల వేషధారణలతో భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.

మొక్కులు తీర్చుకునేందుకు...

మొక్కులు తీర్చుకునేందుకు...

అమ్మవారి విశ్వరూపదర్శనం కోసం మంగళవారం రాత్రి నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తులు పోటెత్తారు. సప్పరాలు మోసుకుంటూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

అవిలాల గ్రామానికి చెందిన కైకాల కులస్తులు పేరంటాళ్ల వేషం ధరించి విశ్వరూపదర్శనంలో ఉన్న అమ్మవారి చెంపను నరికే ఘట్టంతో జాతర పరిసమాప్తం అయింది.

నాలుకకు త్రిశూలం గుచ్చుకుని..

నాలుకకు త్రిశూలం గుచ్చుకుని..

వెదురు దబ్బలతో గోపుర ఆకారంలో సప్పరాలు తయారు చేస్తారు. శరీర ఆకృతికి అనుగుణంగా తయారు చేసిన సప్పరాలను నేల వాలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు

వేషాధారణలో..

వేషాధారణలో..

వారం రోజులుగా వివిధ రకాల వేషధారణలతో భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.

గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

చెంప నరికే కార్యక్రమం అనంతరం అమ్మవారి విగ్రహం మట్టి కోసం భక్తులు పోటీపడ్డారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తిరుగుపయనమయ్యారు.

గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

గంగమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

గంగమ్మ జాతరలో పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు జాతరకు హాజరై అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

జాతరలో అమ్మవారు

జాతరలో అమ్మవారు

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రి నాయుడు, ఆయన సతీమణి దాక్షాయణి, మూడో అదనపు జిల్లా జడ్జి రవీంద్రబాబు, ఇతర న్యాయమూర్తుల బృందం అమ్మవారిని దర్శించుకుంది.

వేషాధారణలో..

వేషాధారణలో..

గంగమ్మ జాతర సందర్భంగా వారం రోజులుగా వివిధ రకాల వేషధారణలతో భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.

English summary
The penultimate day of ‘Tirupati Gangamma Jatara’ turned colourful as devotees with traditional structures - ‘sapparalu’ thronged in huge numbers to the Gangamma Temple, in the morning hours of Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X