హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌చే సిఫార్స్ దుస్థితికి, సెల్ఫ్‌గోల్: హరీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో విజయం తెలంగాణ రాష్ట్ర సమితినే వరిస్తుందని, తెలంగాణను అడ్డుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిఫార్సులతో అభ్యర్థిని ఎంపిక చేసే దయనీయస్థికి బీజేపీ చేరుకుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు బుధవారం విమర్శించారు.

మెదక్ లోకసభకు జరగనున్న ఉప ఎననికల్లో నామినేషన్ వేయకముందే తెరాస విజయం ఖారరైందన్నారు. రెండో స్థానం కోసమే బీజేపీ, కాంగ్రెసు పార్టీలో పోటీ చేస్తున్నాయన్నారు. ఈ ఎన్నిక తెలంగాణ ఉద్యమకారుడికి, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతోందన్నారు.

TRS win in Medak is certainly: Harish Rao

ఆంధ్రా ముఖ్యమంత్రులకు వత్తాసు పలుకుతూ ఉద్యమకారుల, విద్యార్థుల పైన కేసులు పెట్టించిన వారిని కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిగా నిలిపిందన్నారు. సమైక్యాంధ్ర నినాదంతో తెలంగాణవాదులపై దాడులకు దిగుతూ ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదంటూ సోనియా గాంధీకిలేఖ ఇచ్చిన జగ్గారెడ్డిని బీజేపీ బరిలోకి దింపిందన్నారు.

వీరిని తమ అభ్యర్థులుగా ప్రకటించిన ఆ రెండు పార్టీలది సెల్ఫ్ గోల్ అన్నారు. పరోక్షంగా ఆ పార్టీలు ఓటమికి అంగీకరించాయన్నారు. మరో రెండు మూడు రోజులలో ఇతర పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో తెరాసలో చేరుతారని చెప్పారు.

English summary
TRS win in Medak is certainly, says minister Harish Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X