హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాట్పాప్‌లో స్నేక్ గ్యాంగ్ వీడియో: చానల్ ఎండీ అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

TV channel md arrested
హైదరాబాద్: పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహీన్ నగర్‌లో ఫాంహౌస్‌లో ఫైజల్ దయానీ ముఠా చిత్రీకరించిన సామూహిక అత్యాచారం విజువల్స్‌ను వాట్సాప్ ద్వారా పోస్టు చేసిన చానల్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి పైన ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.

సైబరాబాద్ అదనపు డీసీపీ (క్రైం) జానకీ షర్మిలా కథనం ప్రకారం.. నిర్జన ప్రదేశాలు, ఫాంహౌస్‌లు లక్ష్యంగా చేసుకొని బాధితులను పాములతో భయపెట్టి నిస్సహాయులను చేసి అత్యాచారం చేయడంతో పాటు ఆ దృశ్యాలను ఫైజల్ దయానీ ముఠా వీడియో తీస్తోంది. ఆ దృశ్యాలను చూపి బాధితులు ఎక్కడా తమ ఆకృత్యాలు బయటపెట్టకుండా బెదిరిస్తుంటారు.

అనేక మంది వారి ఆకృత్యానికి బలయ్యారు. షాహీన్ నగర్ ఫాంహౌస్‌లో స్నేక్ గ్యాంగ్ యువతి పైన సామూహిక అత్యాచారానికి పాల్పడి వీడియో తీశారు. ఆ చిత్రాలను సేకరించిన పాతబస్తీలోని స్థానిక మెగా ఛానల్ నిర్వహకుడు ఎండీ అక్బర్ వాట్సాప్ ద్వారా అప్ లోడ్ పోస్టు చేశాడు.

వాటిని అతను ఇద్దరు యువకుల నుండి పొందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్బర్‌ను అరెస్టు చేశారు. అతడి పైన ఐటీ చట్టం 66ఏ, 67ఏ, 509తో పాటు ఐపీసీ సెక్షన్స్ 120 బీ కింద కేసు నమోదు చేశారు. అతడికి ఆ దృశ్యాలను అందించిన ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాక ఈ దృశ్యాలను ప్రసారం చేయనున్నామని ముందస్తు ప్రసారం చేసిన ప్రముఖ ఛానల్స్ పైన చట్టపర చర్య తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
One TV channel md arrested for airing snake gang videos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X