వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆడిపోసుకుంటున్నారు: టిఆర్ఎస్‌పై ఏపి మంత్రి ఉమా

|
Google Oneindia TeluguNews

Uma Maheswar Rao fires at TRS
హైదరాబాద్: రాష్ట్రంలో నూతన ప్రాజెక్టుల నిర్మాణాలు కేంద్ర జల సంఘం, నదీ నిర్మాణ సంస్థలు, అంతర్రాష్ట్ర జలమండలిల ఆమోదంతోనే జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అనవసరంగా ఏపి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, తెలంగాణ తెలుగుదేశం నాయకులను ఆడిపోసుకుంటున్నారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న విధంగానే నడుచుకుంటున్నామని ఆయన చెప్పారు. అపెక్స్ కౌన్సిల్, కేంద్ర జల సంఘం ఆమోదం తర్వాతే నూతన ప్రాజెక్టులు నిర్మించాలని అన్నారు. అపెక్స్ కమిటీలో తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు సభ్యులుగా ఉంటారని చెప్పారు. అపెక్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్న కెసిఆర్ మాట తప్పుతున్నారని అన్నారు. తెలంగాణ మంత్రి హరీశ్ రావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని అన్నారు.

కేంద్ర జల సంఘం ఆమోదం తర్వాత కొత్త ప్రాజెక్టులు అమల్లోకి వస్తాయని ఉమామహేశ్వరరావు తెలిపారు. అనవసరంగా తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్ నాయకులు తమను ఆడిపోసుకుంటున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా చేసి ఆయన దారిన ఆయన పోయారని అన్నారు.

ఇప్పుడు కెసిఆర్ జలయజ్ఞంతో ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

English summary
Andhra Pradesh Minister Uma Maheswar Rao on Tusday fired at Telangana Rashtra Samithi and Telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X