విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొలువుదీరేందుకు సిద్ధమైన గణేష్ విగ్రహాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వినాయక చవితికి ఒక రోజు మాత్రమే ఉండటంతో నగరంలో గణనాథుడి విగ్రహాలు సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను పలువురు సామాజికి వేత్తలు ఉచితంగా అందజేస్తున్నారు. మట్టి గణపతిని వాడండి అనే నినాదంతో బుధవారం సాయంత్రం ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.

పరిశోధక విద్యార్థి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విసి రాజు మాట్లాడుతూ.. పర్యావరణంతో పాటు మత్స్య సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. ప్రజలంతా మట్టి గణపతిని వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఈఏ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య, కె. రామ్మోహన రావు, తదితరులు పాల్గొన్నారు.

నగరంలోని లంకా మైదానంలో శ్రీ సిద్ది వినాయక పూజా మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ నవతరం యూత్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మానస మురళి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన మండపంలో 79 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నామని చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలోని భక్తాంజనేయ స్వీట్స్‌లో ఎనిమిది టన్నుల లడ్డును తయారు చేయిస్తున్నామని, గురువారం దీన్ని తీసుకురానున్నామని చెప్పారు. ఈ లడ్డూ గిన్నిస్ బుక్‌లో నమోదు కానుందనీ, దీని కోసం సంబంధిత అధికారులు గురువారం తూకం వేయనున్నారని తెలిపారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రసాద్, గణేష్, బాలు, రాజు, రమణ పాల్గొన్నారు.

మట్టి వినాయకులు

మట్టి వినాయకులు

వినాయక చవితికి ఒక రోజు మాత్రమే ఉండటంతో నగరంలో గణనాథుడి విగ్రహాలు సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి.

మట్టి వినాయకులు

మట్టి వినాయకులు

మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను పలువురు సామాజికి వేత్తలు ఉచితంగా అందజేస్తున్నారు.

మట్టి వినాయకులు

మట్టి వినాయకులు

బీచ్ రోడ్డులోని కాళీమాత ఆలయం వద్ద వీరూ మామ, సతీష్ నేతృత్వంలో వీటీమ్, పొన్నం ఫౌండేషన్ ప్రతినిధులు బుధవారం సాయంత్రం వెయ్యి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

మట్టి వినాయకులు

మట్టి వినాయకులు

మట్టి గణపతిని వాడండి అనే నినాదంతో బుధవారం సాయంత్రం ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.

మట్టి వినాయకులు

మట్టి వినాయకులు

పరిశోధక విద్యార్థి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విసి రాజు మాట్లాడుతూ.. పర్యావరణంతో పాటు మత్స్య సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు.

మట్టి వినాయకులు

మట్టి వినాయకులు

నగరంలోని లంకా మైదానంలో శ్రీ సిద్ది వినాయక పూజా మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ నవతరం యూత్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మానస మురళి తెలిపారు.

మట్టి వినాయకులు

మట్టి వినాయకులు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన మండపంలో 79 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నామని చెప్పారు.

మట్టి వినాయకులు

మట్టి వినాయకులు

తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలోని భక్తాంజనేయ స్వీట్స్‌లో ఎనిమిది టన్నుల లడ్డును తయారు చేయిస్తున్నామని, గురువారం దీన్ని తీసుకురానున్నామని చెప్పారు.

మట్టి వినాయకులు

మట్టి వినాయకులు

విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుకోవాలనే ఆశయంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వీరూ మామ, సతీష్ నేతృత్వంలో వీటీమ్, పొన్నం ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

English summary
Vinayaka statues making in Visakhapatnam. Some social workers offered free clay Vinayaka statues to people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X