విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దామోదర్ దొరికాడు, కిడ్నాపర్ల ఆటకట్టు (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వారం రోజుల కిందట జరిగిన బాలుని కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. పెందుర్తిలోని చింతల అగ్రహారానికి చెందిన కోరుబిల్లి శ్రీనివాసరావు కుమారుడు దామోదర్ ఈ నెల 8వ తేదీ సాయంత్రం కిడ్నాప్‌నకు గురైన సంగతి తెలిసిందే. దామోదర్‌ను విడిచిపెట్టడానికి కిడ్నాపర్లు 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో డిసిపి నాయక్, ఎసిపి సిఎం నాయుడు నేతృత్వంలో నాలుగు పోలీస్ బృందాలు రాత్రింబవళ్లు కష్టపడి దామోదర్‌ ఆచూకీని కనిపెట్టారు.

దామోదర్ తమవద్దే సురక్షితంగా ఉన్నాడని శ్రీనివాసరావుకు తెలియచేసేందుకు వీడియో చిత్రీకరించి, దాన్ని చిప్‌లోకి ఎక్కించి వేపగుంట సమీపంలోని ఒక గుడి హుండీలో వేశారు. కిడ్నాపర్ల వత్తిడికి తలొగ్గి దూకుడుగా ముందుకు వెళితే, బాలునికి ప్రాణ హాని కలుగుతుందని భావించిన పోలీసులు పెందుర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లోని కాయిన్ బాక్స్‌ల వద్ద నిఘా ఏర్పాటు చేశారు.

సోమవారం సాయంత్రం గోపాలపట్నం హైస్కూల్ దగ్గర ఉన్న కాయిన్ బాక్స్ నుంచి కిడ్నాపర్లలో ఒకరు దామోదర్ తండ్రికి ఫోన్ చేస్తుండగా పోలీసులు దాడి చేసి అతనిని పట్టుకున్నారు. కిడ్నాపర్ ఇచ్చిన ఆచూకీతో బాలుడిని బంధించి ఉంచిన ప్రాంతానికి పోలీసు బలగాలు బయల్దేరి వెళ్లాయి.

పెందుర్తి జూనియర్ కాలేజీకి అత్యంత సమీపంలో ఉన్న కమ్మల పాక కొండపై ఉన్న అటవీ ప్రాంతంలో బాలుడిని కిడ్నాపర్లు బంధించారు. పోలీసులు ముందుగా కొండను చుట్టుముట్టారు. నెమ్మదిగా కిడ్నాపర్ల స్థావరానికి చేరుకుని అక్కడున్న మరో కిడ్నాపర్‌తో సహా బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లను పోలీసులు విచారణ నిమిత్తం తరలించారు.

 దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

విశాఖపట్నానికి చెందిన బాలుని కిడ్నాప్‌ వ్యవహారం సోమవారం నాడు సుఖాంతమైంది. పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బాలుని కాపాడారు. ఈ కేసులో ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేశారు.

దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

పెందుర్తిలోని చింతల అగ్రహారానికి చెందిన కోరుబిల్లి శ్రీనివాసరావు కుమారుడు దామోదర్ ఈ నెల 8వ తేదీ సాయంత్రం కిడ్నాప్‌నకు గురైన సంగతి తెలిసిందే. దామోదర్‌ను విడిచిపెట్టడానికి కిడ్నాపర్లు 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు.

 దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

నన్ను సైకిలెక్కించుకున్నారు. ఆ తర్వాత కొండపైకి తీసుకెళ్లి కిడ్నాప్ చేశామని చెప్పారు. వారు నిద్రపోయినప్పుడు తప్పించుకుందామని ఒకసారి ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు. పోలీసులు వచ్చి రక్షించడంతో ఎంతో ఆనందంగా ఉందని దామోదర్ తెలిపాడు.

 దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

కిడ్నాప్ కథ సుఖాంతం అనంతరం తన తల్లిదండ్రులు, చుట్టాలతో ఫోన్‌లో మాట్లాడుతున్న బాలుడు దామోదర్.

దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

పోలీసులు దామోదర్ వద్ద నుండి వాంగూల్మాన్ని నమోదు చేసుకుంటున్న దృశ్యం. వెంటనే కిడ్నాప్‌గానే ఈ కేసును పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడిని కిడ్నాప్‌ చేసిన వ్యక్తులు రెండు రోజల క్రితం బాలుని ఇంటి సమీపంలో ఒక ఆలయం వద్ద మెమొరీ కార్డును ఉంచినట్టు సమాచారం ఇచ్చారు.

పోలీసులతో ఫోటోలకు ఫోజులిస్తున్న బాలుడు దామోదర్. సోమవారంనాడు డిసిపి రామ్‌ నాయక్‌ నాయకత్వంలో కొందరు పోలీసులు కుంభవృష్టి కురుస్తున్నా వారు చొరవతో బాలుని దాచిన కొండ గుహల ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కిడ్నాపర్లు ప్రతిఘటించడానికి యత్నించినా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

 దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

బాలుడు కాస్త నీరసంగా ఉండడంతో పోలీసులు బాలుని ఆస్పత్రికి ప్రాథమిక పరీక్షలకోసం పంపించారు.

 దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

బాలుడు సురక్షితంగా ఉన్న విషయాన్ని పోలీసు అధికారులు బాలుని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారి సంతోషంగా ఉన్నారు.

 దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

కోరుబిల్లి శ్రీనివాసరావు పెందుర్తి ప్రాంతంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి పెద్దగా ఆస్తి కూడా లేదు. శత్రువులు కూడా లేరు.

 దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

ఈ కిడ్నాప్‌ను పోలీసులు సవాలుగా తీసుకోని కేసును ఛేదించారు. కిడ్నాప్ కథ సుఖాంతం అనంతరం తన తల్లిదండ్రులు, చుట్టాలతో ఫోన్‌లో మాట్లాడుతున్న బాలుడు దామోదర్.

 దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

దామోదర్‌కి మజ్జిగ ఇచ్చి త్రాగమని చెప్తున్న తన తండ్రి కోరుబిల్లి శ్రీనివాసరావు. కోరుబిల్లి శ్రీనివాసరావు పెందుర్తి ప్రాంతంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు.

దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

దామోదర్ దొరికాడు, వారం రోజుల సస్పెన్స్‌కు తెర

విశాఖపట్నానికి చెందిన బాలుని కిడ్నాప్‌ వ్యవహారం సోమవారం నాడు సుఖాంతమైంది. పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బాలుని కాపాడారు. ఈ కేసులో ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Visakhapatnam Boy Kidnap Mystery Solved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X