ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీకి వైరా ఎమ్మెల్యే రాజీనామా, టిఆర్ఎస్‌లోకి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఖమ్మం జిల్లా వైరా శాసనసభ్యుడు మదన్‌లాల్ రాజీనామా చేశారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. మదన్‌లాల్‌తో పాటు 11 మంది ఎంపిటీసిలు, 24 మంది సర్పంచ్‌లు టిఆర్ఎస్‌లో చేరడానికి సిద్ధమైనట్లు సమాచారం.

వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ సైతం తెరాసలో చేరేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలోనే ఇటీవల మదన్‌లాల్‌ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన నివాసంలో కలిపి పార్టీలో చేరేందుకు తన సుముఖతను వ్యక్తం చేశారు.

Vyra MLA Madanlal resigns from YSRCP

మరో ఇద్దరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు కూడా తెరాసలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఖమ్మం జిల్లాలో బలం పుంజుకునేందుకు తెరాస నేతలు వివిధ పార్టీల నాయకులకు గాలం వేస్తున్నారు.

కాగా, ఖమ్మం జిల్లా కాంగ్రెసు పార్టీ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఆయన తెరాసలో చేరేందుకే కలిసినట్లుగా చెబుతున్నారు.

English summary
YS Jagan lead YSR Congress MLA from Vyra in Khammam district Madanlal resigned for the party and decided to join in K Chandrasekhar Rao lead Telangana Rastra Samithi (TRS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X