వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ అల్లుడు కాకుంటే, సిగ్గుందా: చంద్రబాబుపై హరీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

What about my questions: Harish to Chandrababu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు గురువారం నిప్పులు చెరిగారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు అల్లుడు కాకపోయి ఉంటే చంద్రబాబును ఎవరైనా పట్టించుకునే వారా అని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామనే ఆత్మ విశ్వాసాన్ని హరీష్ వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో మాత్రమే గెలిచే పార్టీ అంటూ తెరాసను చంద్రబాబు ఎగతాళి చేయడం విడ్డూరమన్నారు. టిడిపి కంటే తెరాసకు ఒక్క సీటు ఎక్కువొచ్చినా తెలంగాణలో టిడిపి దుకాణం మూసుకుంటారా అని ప్రశ్నించారు.

బిజెపితో జతకట్టడం ఒక చారిత్రక తప్పిదం అని గతంలో చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ అదే పార్టీకి దగ్గరవుతున్నారన్నారు. చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు మానుకొని, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. పోలవరం, ఉద్యోగులు, ఉమ్మడి రాజధాని తదితర అంశాలపై తాను గతంలో పది ప్రశ్నలు సంధించానని, వాటిపై స్పందించాలన్నారు.

టిడిపి కంటే మాకు ఎక్కువ సీట్లు వస్తే పార్టీని మూసేస్తారా అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే తాము కాంగ్రెసు పార్టీకి దూరమయ్యామని, టిడిపిని స్పష్టత అడుగుతున్నామన్నారు. చంద్రబాబుకు తెలంగాణలో ముఖం చెల్లక మోడీ ముసుగు పెట్టుకొని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ఎన్టీఆర్‌కు అల్లుడు కాకపోయి ఉంటే ఎవరు పట్టించుకునే వారు కాదన్నారు. మామను ముంచి, బావమరుదులను వంచించిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. పదిహేనేళ్ల పాటు తెలంగాణను ఆపిన చంద్రబాబు.. తాను తెలంగాణకు వ్యతిరేకిని కాదని చెప్పేందుకు సిగ్గుందా అన్నారు. చంద్రబాబు కారంచేడు, చుండూరుల గురించి ఎందుకు మాట్లాడరన్నారు. రానున్న ఎన్నికల్లో తెరాస ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు.

English summary
Telangana Rastra Samithi MLA Harish Rao on Thursday questioned TDP chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X