కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్తను బండరాయితో చంపిన భార్య: దంపతుల హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Wife kills husband in kurnool district
హైదరాబాద్: భార్యాభర్తల మధ్య గొడవలు చివరకు భర్త ప్రాణాల్ని బలిగొన్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ సవరమ్మ కాలనీలో సోమవారం ఉదయం ఈ సంఘటన వెలుగు చూసింది. భర్తతో మనస్ఫర్థలు ఉన్న చిట్టెమ్మ క్షణికావేశంలో బండరాయితో భర్త దస్తగిరి తలపై కొట్టింది. బలమైన దెబ్బ తగలడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. తెల్లవారుజామున గస్తీ తిరుగుతున్న పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన లేఅవుట్ వద్ద కాపలాగా ఉన్న దంపతులు హత్యకు గురయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల వద్ద సోమవారం ఈ సంఘటన వెలుగు చూసింది. హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పశ్చిమగోదావరి జిల్లా తంగెళ్లగూడెం వద్ద సోమవారం ఉదయం ట్రాక్టర్ అదుపు తప్పడంతో 17మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, క్షతగాత్రులందరికీ వైద్య సహాయం అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

మహబూబ్‌నగర్ జిల్లా, శ్రీశైలం ప్రధాన రహదారిలోని దోమలపెంట శివాలయం సమీపంలో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో అదుపు తప్పిన లారీ ముందు వెళ్తున్న కారును ఢీకొనగా రోడ్డుదాటి వెళ్తున్న మహిళ మృతి చెందింది.

ఈగలపెంట ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... తాండూరు నుంచి నాపబండలతో వస్తున్న లారీ దోమలపెంట చెక్‌పోస్టు వద్ద బ్రేక్ ఫెయిలై శివాలయం వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద నెమ్మదిగా వెళ్తున్న కారును ఢీకొంది. ఈ సంఘటనలో కారు రెండు పల్టీలు కొట్టి అంజమ్మ (62)కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందింది.

కారులో ప్రయాణిస్తున్న పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలుకు చెందిన గాయత్రి (22), రేణుక (25)కు గాయాలు కాగా సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత లారీ సుమారు ఒక కిలోమీటరు పైగా ప్రయాణించి ఇఆర్‌నగర్ మలుపు వద్ద సుమారు 50 అడుగుల కిందికి పడిపోయింది. డ్రైవర్ పరారైనట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

English summary
A woman killed her husband in kurnool district. Meanwhile, Wife and husband killed in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X