వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విందు: ఇప్పుడైనా బాబు, కేసీఆర్ మాట్లాడుకుంటారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావులు ఒకప్పుడు మంచి మిత్రులు... ఇప్పుడు రాజకీయ విరోధులు! విభజన అంశం వీరిద్దరి మధ్య అగాధాన్ని పెంచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య తరచూ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

విభజన జరిగి 50 రోజులవుతున్నా ఇప్పటికీ వీరిద్దరూ ఎడమొహం, పెడముహంగా ఉంటున్నారు. బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాదులో జరిగిన మహంకాళీ జాతరతో కాస్తలో చంద్రబాబు, కేసీఆర్‌లల కలయిక కొద్దిలో తప్పిపోయింది. వారిద్దరిని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానించారు. అయితే, ఒకరి తర్వాత ఒకరు అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇప్పుడు గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. దీనికి వీరిద్దరు హాజరవుతున్నారు. ఇప్పుడైనా బాబు, కేసీఆర్ ఎదురుపడతారా? ఎదురుపడితే మాట్లాడుకుంటారా? ఏం జరుగుతుందనేది? ఆసక్తికరంగా మారింది. భవిష్యత్తులో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా అనేక అంశాల్లో వీరిద్దరూ చర్చించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంది.

చంద్రబాబు, కేసీఆర్

చంద్రబాబు, కేసీఆర్

ఒకప్పుడు చంద్రబాబు కేబినెట్లో పని చేసిన కేసీఆర్... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెరాసను స్థాపించారు. 2009 ఎన్నికల అనంతరం, ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయిన తర్వాత కూడా కేసీఆర్ ప్రధానంగా టీడీపీని టార్గెట్‌గా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.

చంద్రబాబు, కేసీఆర్

చంద్రబాబు, కేసీఆర్

ఒకప్పుడు మిత్రులు అయిన బాబు, కేసీఆర్‌లు ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిపోయారు. ఒకరి పైన ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. విభజన జరిగి యాభై రోజులు అయినా ఇంకా వారు ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు.

చంద్రబాబు, కేసీఆర్

చంద్రబాబు, కేసీఆర్

ఏపీకీ చంద్రబాబు, తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రులు. రెండు రాష్ట్రాలైన నేపథ్యంలో... ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంది. అయితే, ఈ సమస్యల పైన ఎవరికి వారు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.

చంద్రబాబు, కేసీఆర్

చంద్రబాబు, కేసీఆర్

అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్, తెరాసలు చంద్రబాబును, టీడీపీని, అలాగే... టీడీపీ, చంద్రబాబులు కేసీఆర్, తెరాసను విమర్శించారు.. విమర్శిస్తున్నారు.

 చంద్రబాబు, కేసీఆర్

చంద్రబాబు, కేసీఆర్

చంద్రబాబు, కేసీఆర్‌లు ముఖ్యమంత్రులు కాకముందు పార్టీ అధ్యక్షుల హోదాల్లో విమర్శలు గుప్పించుకున్నారు. ఇప్పుడు సీఎంల హోదాలో విమర్శలు గుప్పించుకుంటున్నారు.

చంద్రబాబు, కేసీఆర్

చంద్రబాబు, కేసీఆర్

ఇరు రాష్ట్రాల మధ్య ఫీజు రీయింబర్సుమెంట్స్, జలవివాదాలు, విద్యుత్, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్, ఎంసెట్ కౌన్సెలింగ్, పోలవరం రగడ వంటి సమస్యలు ఉన్నాయి.

చంద్రబాబు, కేసీఆర్

చంద్రబాబు, కేసీఆర్

ఇరు రాష్ట్రాలు పలు సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంది. కేసీఆర్ తనకు కొత్త కాదని, ఆయనతో తాను మాట్లాడేందుకు తాను సిద్ధమని చంద్రబాబు చెబితే... పొరుగు రాష్ట్రాల సీఎంలు ఎలాగో చంద్రబాబు తనకు అలా అని కేసీఆర్ చెప్పారు. ఇరువురు సమస్యలపై చర్చించేందుకు సై అన్నారు. కానీ అది ఇంత వరకు ముందు అడుగు వేయలేదు.

 చంద్రబాబు, కేసీఆర్

చంద్రబాబు, కేసీఆర్

గవర్నర్ రాజ్ భవన్లో విందు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు, కేసీఆర్‌లు ఎదురు పడతారా, ఎదురు పడితే ఏమౌతుంది, ఇరువురు నేతలు మాట్లాడుకుంటే.. సమస్యలు ఇక సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ సాగుతోంది.

 చంద్రబాబు, కేసీఆర్

చంద్రబాబు, కేసీఆర్

ఇటీవల జరిగిన ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాల జాతరకు తలసాని శ్రీనివాస్ యాదవ్.. చంద్రబాబు, కేసీఆర్‌లను ఆహ్వానించారు. ఇరువురు ఒకేసారి రాకపోవడంతో కొద్దిలో వారి కలయిక తప్పిపోయింది. ఇప్పుడు గవర్నర్ విందులో కలుస్తారా అనేది చర్చనీయాంశమవుతోంది.

English summary
Will AP CM Chandrababu and Telangana KCR meet in Raj Bhavan?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X