హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గూగుల్ ఇండియా సహా ఒప్పందాలు, బాబుకు కితాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో జరుగుతున్న ఐటీసీఈవోల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వానికి గూగుల్ ఇండియా, విప్రో, టెక్ మహీంద్రా, సమీర్ తదితర సంస్థలతో కీలక ఒప్పందాలు జరిగాయి. 400 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సుకు ఏపీ సీం చంద్రబాబు నాయుడు, ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు గోపాలకృష్ణన్ తదితరులు హాజరయ్యారు.

మధురవాడ ఐటీ ఇంక్యూబేషన్ సెంటర్ అభివృద్ధికి అవగాహన ఒప్పందం, మధురవాడ ఐటీ సెంటర్ అభివృద్ధికి మాబ్ ఎంఈ/స్టార్ట్ అప్ విలేజ్‌తో ఒప్పందం, చిరు వ్యాపారులు, మహిళలకు ఇంటర్నెట్ ద్వారా లబ్ధి పొందేందుకు గూగుల్ ఇండియా సాయం, డిజిటల్ ఏపీ ప్రాజెక్టులో భాగంగా గూగుల్ ఇండియాతో అవగాహన ఒప్పందం జరిగాయి.

Wipro, Tech Mahindra to invest in Vishaka

విశాఖ ఓ ఐకాన్‌గా నిలుస్తుంది: గోపాలకృష్ణన్

మేడిన్ ఇండియా, మేడిన్ ఏపీలో విశాఖ ఓ ఐకాన్‌లా నిలుస్తుందని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు గోపాలకృష్ణన్ అన్నారు. ఐటీని ఉపయోగించుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చునని తెలిపారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పాలన అద్భుతంగా ఉందని, ఇప్పుడు కూడా బాబు విజయవంతమైన పాలన అందిస్తారన్నారు.

English summary
Wipro, Tech Mahindra to invest in Vishakapatnam of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X