హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేస్‌బుక్ పరిచయం: మహిళకు ముగ్గురు కుచ్చుటోపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫేస్‌బుక్ పరిచయం, బంగారు ఆభరణాలు, ఫోన్ కానుకగా పంపిస్తామని చెప్పి ఆ తర్వాత కస్టమ్స్ డ్యూటీ సాకులతో డబ్బులు తమ అకౌంటులో జమ చేయించుకుంటూ రూ.లక్షలు కాజేస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ప్రధాన నిందితుడు, అతడి అనుచరుడు పరారీలో ఉన్నారు.

సైబరాబాద్ అదనపు డీసీపీ జానకీషర్మిల కథనం ప్రకారం... నాగోలుకు చెందిన సరితకు ఢిల్లీకి చెందిన మిట్టు అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. ఐఫోన్, బంగారు ఆభరణాలు పార్సిల్‌లో గెలుచుకున్నారని, వాటిని పంపిస్తానని నమ్మించాడు. కస్టమ్స్ డ్యూటీ కింద రూ.34వేలు తాను సూచించే బ్యాంకు అకౌంటులో వేయాలని చెప్పాడు.

Woman duped through FB of Rs.1.7 lakh

అయితే, తాను మోసపోయినట్లు గ్రహించిన ఆమె జూన్ 26న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు మిట్టు ఇచ్చిన అకౌంట్ నెంబర్ల ఆధారంగా చైతన్యపురి గణేష్ పురి కాలనీలో నివసిస్తున్న రాహత్ అలీ, మహ్మద్ తన్వీర్ అన్సారీ, షాహుస్సేన్‌లను అరెస్టు చేశారు. వీరు బీహార్‌కు చెందిన వారు.

English summary
A fraud lured a woman from Nagole on Facebook chat and convinced her that she won a prize containing gold jewellery and IPhones worth lakhs of Rupees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X