హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రపంచస్థాయి సెంటర్లు:బాబు(ఫొటోలు), దండగ: వనమా

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వాణిజ్య సదస్సులు, ప్రదర్శనలు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తాయని ఆయన అన్నారు. హైదరాబాదు హైటెక్స్‌లో శనివారం ఏర్పాటైన ఇండియన్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ సదస్సులో ఆయన ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజ్ఞాన, నైపుణ్యాలకు నెలవుగా తయారు చేస్తామని ఆయన చెప్పారు. ఎపిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్లు, వైజ్ఞానిక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గ్రామీణ తరహా ఉత్పత్తుల గుర్తింపునకు వాణిజ్య ప్రదర్శనలు దోహదం చేస్తాయని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికపై స్పందించడానికి టిడిపి కాకినాడ అర్బన్ శాసనసభ్యుడు కొండబాబు నిరాకరించారు. ఎపి రాజధానిగా కాకినాడను చేయబోరని ఆయన అన్నారు. ఇక దాని గురించి మాట్లాడడం దండగ అని ఆయన అన్నారు.

రాజధాని విషయంపై మాట్లాడడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని, మంత్రిమండలి మాట్లాడుతుందని ఆయన అన్నారు.

చంద్రబాబుకు స్వాగతం

చంద్రబాబుకు స్వాగతం

హైదరాబాదులోని హైటెక్స్‌లో జరిగిన ఇండియన్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ సదస్సుకు వచ్చిన చంద్రబాబుకు ఇలా స్వాగతం

బాబు కీలకోపన్యాసం

బాబు కీలకోపన్యాసం

హైదరాబాదులోని హైటెక్స్‌లో జరిగిన ఇండియన్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ సదస్సులో కీలకోపన్యాసం చేస్తున్న చంద్రబాబు

సదస్సు ప్రతినిధులు...

సదస్సు ప్రతినిధులు...

హైదరాబాదులోని హైటెక్స్‌లో జరిగిన ఇండియన్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ సదస్సులో చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు.

యాక్సెంటర్ ప్రతినిధులతో...

యాక్సెంటర్ ప్రతినిధులతో...

యాక్సెంటర్ ప్రతినిధులు చైర్మన్ అవినాష్ వశిష్ట, ఎండి సంజీవ్ గుప్తా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు

English summary
Andhra Pradesh CM and Telugudesam party president Nara Chandrababu Naidu said that world class convention centres will be established in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X