వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటి, కమ్యూనికేషన్లకు విధానపత్రాలు: యనమల

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2014 0 2015 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ఉదంయ 11 గంటలకు శానససభలో ప్రతిపాదించారు. 2014 - 15 బడ్జెట్ మొత్తం రూ.1,11,884 కోట్లు అని, ప్రణాళికా వ్యయం రూ.85,151 కోట్లు అని ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో అన్నారు.

ద్రవ్యలోటు రూ.19,028 కోట్లు, రెవెన్యూ లోటు రూ.6,064 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.26,6734 కోట్లు ఉంటుందని ఆయన చెప్పారు.2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తామని ఆయన చెప్పారు. పాలనా యంత్రాంగాన్ని పునరుత్తేజం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సందర్భంగా అనేక సమస్యలు గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సక్రమ ప్రణాళికల రూపకల్పనకు అవకాశం లేకుండా విభజన జరిగిందని అన్నారు.

గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆయన అన్నారు. అవినీతి, కుంభకోణాలు కొంత కాలంగా రాజ్యమేలాయని విమర్శించారు. అవ్యవస్థను సరిదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు.

తాము బడ్జెట్ కేటాయింపులకు మాత్రమే పరిమితం కాబోమని యనమల చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాదయాత్రలో అనేక ప్రజా సమస్యలు గుర్తించారని, ఎస్పీ ఉప ప్రణాళిక అమలుతో అభివృద్ధిలో వెనుకబటాను అధిగమిస్తామని చెప్పారు. బీసిలకు ప్రత్యేక ఉప ప్రణాళిక అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వికేంద్రీకరణ అంటే మెరుగైన పద్ధతిలో సేవలు అందించడమని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో నూతన ఒరవడి అవసరమని ఆయన అన్నారు.

yanamala ramakrishnudu

రాష్ట్రంలో యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు యనమల తెలిపారు. ప్రతి ఊరికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయం, పాడి, పశుసంవర్ధక, మత్స్య వంటి శాఖల మధ్య సమన్వయం సాధిస్తామని చెప్పారు. ముమ్మరగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు.

సత్వర ప్రణాళిక అభివృద్ధి కోసం ఏడు మిషన్లను అమలు చేస్తామని చెప్పారు. సామాజిక సాధికార మిషన్, సేవారంగ మిషన్‌తో పాటు మరో ఐదు మిషన్లు ఉంటాయని చెప్పారు. ప్రతి మిషన్‌కూ ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారని యనమల చెప్పారు.

కాకినాడకు మరో పోర్టు

మచిలీపట్నం ఓడరేవు పనులను వేగవంతం చేస్తామని, అదే సమయంలో కాకినాడలో మరో ఓడరేవును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని యనమల చెప్పారు. విశాఖపట్నం, విజయవాడల్లో విమానాశ్రయాలను మరింతగా విస్తరిస్తామని అన్నారు.

త్వరలో ఎయిమ్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎయిమ్స్‌ను ప్రారంభించనున్నట్లు యనమల తెలిపారు. సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేలా వైద్య విద్యార్థులకు శిక్షణ ఇస్తామని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లాకు ఐఐటి, పిపిపి పద్ధతి ద్వారా కాకినాడకు మరో ఐఐటి కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు.

రోడ్డు ప్రమాదాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన అన్నారు. రహదారి భద్రతకు అనుగుణంగా అన్ని రవాణా సంస్థలకూ ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద గేట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

వ్యవసాయానికి 9 గంటలు కరెంట్

రాష్ట్రంలో వ్యవసాయానికి 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని యనమల హామీ ఇచ్చారు. మైక్రో ఇర్రిగేషన్ ద్వారా పొలాలకు అవసరమైన చోట నీరు అందిస్తామని చెప్పారు. కొత్తగా సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తికి రూ.5 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్లు ఆయన తెలిపారు. గ్రామాలకు త్రీఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. 24 గంటలు విద్యుత్తు సరఫరా చేసే పైలేట్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంపికైందని ఆయన ప్రకటించారు.

ఐటిలో ప్రపంచ స్థాయి గుర్తింపు

పరిశ్రమల అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. పారిశ్రామిక పార్కులు నెలకొల్పడంపై ప్రత్యేక దృష్టి పెట్ిటనట్లు ఆయన తెలిపారు. ఐటి, కమ్యూనికేషన్ రంగాల్లో ఉమ్మడి ఎపి నాయకత్వ స్థాయిని సాధించిందని, విభజన తర్వాత ఐటి రంగంలో నూతన లక్ష్యాలు సాధించాల్సి ఉందని ఆయన అన్నారు. ఐటి కమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి విధానపత్రం రూపకల్పన చేస్తామని చెప్పారు. 18 విధాన పత్రాలు రూపొందించి ఐటి అభివృద్ధికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తామని అన్నారు.

లోటు గుదిబండ

రాష్ట్రంలో రెవన్యూ లోటు గుదిబండగా మారిందని యనమల అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విభజన తీవ్రప్రభావాన్ని చూపిందని వెల్లడించారు. రాష్ట్ర వ్యయం 58 శాతం కన్నా ఎక్కువగా ఉందని, అమ్మకపు పన్ను ద్వారా వచ్చే రాబడి 47 శాతం మాత్రమే అని మంత్రి తెలిపారు. మిగిలిన పన్నుల ఆదాయం 50 శాతం లోపే ఉందన్నారు. ఎక్సైజ్ ఆదాయం మాత్రమే 50 శాతం పైగా ఉన్నట్లు పేర్కొన్నారు. 8, పదో షెడ్యూల్‌లో చేర్చని సంస్థలను గాలికొదిలేశారని విమర్శించారు. పన్నుల వాటా 8.6 శాతం ఉందన్నారు.

కేటాయింపులు

హోం శాఖకు రూ.3,734 కోట్లు

విపత్తు నిర్వహణకు రూ. 403 కోట్లు

ఐటి శాఖకు రూ.111 కోట్లు

పరిశ్రమల శాఖకు రూ.615 కోట్లు

నీటిపారుదల శాఖకు రూ.8,465 కోట్లు

ఇంధన శాఖకు రూ.7,164 కోట్లు

మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.371 కోట్లు

యువజన సర్వీసుల శాఖకు రూ.126 కోట్లు

మహిళా సంక్షేమ శాఖకు రూ.104 కోట్లు

వికలాంగుల సంక్షేమం, వృద్ధులకు రూ.65 కోట్లు

గిరిజన సంక్షేమ శాఖకు రూ.1,150 కోట్లు

వెనుకబడిన తరగతలు సంక్షేమానికి రూ.3,130 కోట్లు

మౌలిక వసతులకు రూ.73 కోట్లు

రోడ్లు, భవనాాల శాఖకు రూ.2,612 కోట్లు

అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖకు రూ.418 కోట్లు

ఇంటర్మీడియట్ విద్యాకు రూ.812 కోట్లుి

ఉన్నత విద్యకు రూ.2,275 కోట్లు

పాఠశాల విద్యకు రూ.12,595 కోట్లు

వైద్య, ఆరోగ్య శాఖకు రూ.4,388 కోట్లు

కార్మిక, ఉపాధి కల్పనకు రూ.276 కోట్లు

పట్టణాభివృద్ధి శాఖకు రూ.3,134 కోట్లు

గ్రామీణ నీటి సరఫరాకు రూ.1,115 కోట్లు

పంచాయతీరాజ్ శాఖకు రూ.4,260 కోట్లు

English summary
Andhra Pradesh finance minister Yanamala Ramakrishnudu presented general budget for the year 2014- 2015 in assembly today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X