వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడి ఏకేశాడు: జగన్ దండం పెట్టి, నవ్వాడు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విశాఖ జిల్లా సీనియర్ రాజకీయ నాయుడు దాడి వీరభద్ర రావు బుధవారం నిప్పులు చెరిగారు.

జగన్‌కు అహంకారం ఎక్కువని, చెల్లిని, తల్లినే నమ్మని వ్యక్తి ఇక ప్రజలను ఎలా నమ్ముతారని ధ్వజమెత్తారు. అనంతరం ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన కుటుంబ సభ్యులు కూడా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు విశాఖపట్నం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

దాడి

దాడి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్ర రావు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఎన్నికల వరకు జగన్ జైలులో ఉంటే ఎపిలో గెలిచే వారేమోనన్నారు. జైలులో జగన్ మాటలు విని తాను మోసపోయానని చెప్పారు. తాను జైలులో చూసిన జగన్ వేరే... ఇప్పుడు చూస్తున్న జగన్ వేరే అని దాడి అన్నారు.

దాడి

దాడి

జైలులో జగన్ మాట్లాడిందంతా నటన అని, అది ఆయన బయటకు వచ్చాక తనకు తెలిసిందన్నారు. తన చెల్లి, తల్లిని నమ్మని జగన్ ప్రజలను ఎలా నమ్ముతాడని ప్రశ్నించారు.

దాడి

దాడి

షర్మిల ఎంపీ అయితే ఎక్కడ మరో పవర్ సెంటర్ అవుతుందోనని జగన్ భయపడ్డారన్నారు. తల్లిని గెలిపించుకునేందుకు కూడా ప్రయత్నించలేదన్నారు. విజయమ్మ ఓటమికి జగనే కారణమని ఆరోపించారు. విజయమ్మ గెలుపు కోసం కొడుకుగా ఆయన ఏం చేశాడో చెప్పాలన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

విశాఖ జిల్లా అనకాపల్లి లోకసభ నియోజకవర్గంలోని అసెంబ్లీ అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలతో వైయస్ జగన్ బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ ఓటమికి గల కారణాలను కార్యకర్తల నుంచి అడిగి తెలుసుకున్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు మాయ మాటలు విని కొంతమంది మోసపోయారని జగన్ అన్నారు. మోడీ, పవన్ కళ్యాణ్ గాలి ఏమాత్రం లేదని చెప్పారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం లేదన్నారు. రైతుల రుణ మాఫీ విషయంలో చంద్రబాబు చేసిన ప్రకటన విని తాము మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

బాబు ఇచ్చిన హామీలు నెరవేరే వరకూ ప్రజల పక్షాన నిలబడి పోరాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వైయస్ జగన్ కార్యకర్తలకు, నాయకులకు సూచించారు.

English summary

 YSR Congress Party chief YS Jagan review meeting in Vishakapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X