వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకృత్యాలు పెరిగాయి: లొంగిపోయన 16మంది మావోలు

|
Google Oneindia TeluguNews

16 maoists surrendered in Chhattisgarh
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బస్తర్ ప్రాంతంలో 16 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 220 మంది నక్సల్స్ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

కేర్లపాల్ ప్రాంతం కమిటీకి చెందిన 14 మంది నిషేధిత సిపిఐ (మావో)కు చెందిన సుక్మా జిల్లా రిజర్వ్ పోలీసు బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో లొంగిపోయారు. ఈ విషయాన్ని బెటాలియన్ కమాండెంట్ వివిఎన్ ప్రసన్న గురువారం తెలిపారు.

కవాసీ బండి(25), జితేందర్ (19), ముసాకీ హిడ్మా(35), భీమ(25), సోమ (44), మడ్కం దేవ (35), సోడి సింగన్ (28) స్థానిక ఆపరేషన్ స్క్వాడ్‌లో పనిచేస్తున్నారు. కింద స్థాయి కేడర్‌ను దోపిడీ చేయడం, మహిళ కార్యకర్తలపై ఆకృత్యాలు పెరగడంతో వారు లొంగిపోతున్నట్టు తెలిపారు.

గిరిజన యువతను భయపెట్టి ఉద్యమంలోకి తీసుకొచ్చి, తరువాత సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తున్నారని ప్రసన్న స్పష్టం చేశారు. అలాగే బీజపూర్ జిల్లాలో ఓ బాలిక సహా ఇద్దరు నక్సల్స్ లొంగిపోయారు. సరిత అలియాస్ స్వరూప కుడియం (17), మున్నా పడం (23) బీజపూర్ కలెక్టర్ అబ్దుల్ ఖైసర్ హక్, ఎస్పీ కెఎల్ ధృవ్ ఎదుటు లొంగిపోయారు.

English summary
The outlawed Maoist movement in Bastar region continued to lose its lower rung cadres as 16 ultras surrendered in south Chhattisgarh, police said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X