వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్ నేత కుమార్ విశ్వాస్‌కు ‘బిగ్‌బాస్’ బంపర్ ఆఫర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్‌కు ఓ టీవీ రియాలిటీ షో నిర్వాహకులు భారీ ఆఫర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేథీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా కుమార్ విశ్వాస్‌కు ప్రచారం ఎక్కువగానే లభించింది. దీంతో తమ టీవీ రియాలిటీలో నటించాలని కార్యక్రమ నిర్మాతలు కోరుతున్నారట.

ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్' నిర్మాతలు తమ కార్యక్రమానికి వస్తే రూ. ఐదు కోట్లు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు. కాగా, కవి కూడా అయిన కుమార్ విశ్వాస్.. త్వరలోనే బాలీవుడ్‌కి ఓ పాట రాసివ్వబోతున్నారు. ఆ పాటను ప్రముఖ గాయని ఆశాభోంస్లే పాడాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది.

'Aam Aadmi' Kumar Vishwas ready to sign Rs 5 cr deal with Bigg Boss makers?

ఈ విషయాలన్ని నిజమేనని కుమార్ విశ్వాస్ వెల్లడించారు. బిగ్‌బాస్ ఆఫర్ మాట కూడా వాస్తవమేనని చెప్పారు. అయితే తాను పాల్గొంటున్నదీ లేనిదీ మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు.

కాగా, ప్రస్తుతం కుమార్ విశ్వాస్ బిజీగా గడుతున్నారు. కుమార్ విశ్వాస్ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో గూగుల్ హెడ్ క్వార్టర్స్‌లో సంస్థ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత కాలిఫోర్నియాలోని స్టోన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో రాజకీయాలపై అతిథి ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు కుమార్ విశ్వాస్ అంగీకరించారని వార్తలు వినిపిస్తున్నాయి.

English summary
Aam Aadmi Party (AAP) leader Kumar Vishwas' political career may have suffered a setback after the General Elections loss, but the renowned Hindi poet's fortunes are flourishing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X