వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ఛాలెంజ్, ఇంప్రెస్: ఛాన్సిస్తే సిద్ధమని అమీర్‌ఖాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఇచ్చిన క్లీన్ ఇండియా కార్యక్రమం తనకు ఎంతో నచ్చిందని, అవకాశమిస్తే ఈ కార్యక్రమానికి తాను బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తానని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ గురువారం తెలిపారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, నీటి వనరులు పరిశుభ్రంగా ఉంటాయని తెలిపారు. ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని అంకితభావంతో అమలు చేయాలని అమీర్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. తన ఇంటిని, కార్యాలయాన్ని స్వయంగా శుభ్రం చేసుకుంటానని ఈ సందర్భంగా తెలిపారు. ఒక్క వ్యర్థ వస్తువు కూడా ఎక్కడా కనిపించదన్నారు.

కాగా, మోడీ గురువారం బాలీవుడ్ నటీనటులు సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, క్రికెటర్ సచిన్ టెండుల్కర్, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ తదితర తొమ్మిది మంది క్లీన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. బహిరంగ ప్రదేశాలలోని పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొనాలని వారికి మోడీ సూచించారు. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి వారిని నామినేట్ చేశానని చెప్పారు.

Aamir Khan on Modi's Swachh Bharat Abhiyan: We Should All Support This

వారు ఈ కార్యక్రమంలో పాల్గొని.. వారు మరికొంతమందిని నామినేట్ చేయాలని సూచించారు. మొన్న ఐస్ బకెట్ చాలెంజ్, నిన్న రైస్ బకెట్ చాలెంజ్, ఆ తర్వాత గ్రీన్ చాలెంజ్‌లు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్రం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టింది. ఓ విధంగా మోడీ కూడా వారికి స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాలని సవాల్ చేశారనవచ్చు.

మోడీ గురువారం బాలీవుడ్ నటీనటులు సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, క్రికెటర్ సచిన్ టెండుల్కర్, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ తదితర తొమ్మిది మంది క్లీన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సచిన్, ప్రియాంక, సచిన్, అనిల్ అంబానీలతో పాటు మోడీ ఆహ్వానం పలికిన వారిలో శశిథరూర్, కమల్ హాసన్, తారక్ మొహతా, మృదుల సిన్హా, బాబా రాందేవ్ ఉన్నారు.

English summary
We Should All Support This, says Aamir Khan on PM Narendra Modi's Swachh Bharat Abhiyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X