వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గడ్కరీ కేసు: బెయిల్‌కి నో, తీహార్ జైలుకు కేజ్రీవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకోవాలని ఢిల్లీ కోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. కోర్టుకు బెయిల్ బాండ్ ఇచ్చేందుకు ఆయన నిరాకరించిన నేపథ్యంలో ఆయన పైన చర్యలు తీసుకుంది.

గతంలో ఎన్నికల ప్రచారం సమయంలో భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు నితిన్ గడ్కరీ పైన కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై గడ్కరీ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై ఢిల్లీ కోర్టు విచారణ చేపట్టింది. ఈ పరువు నష్టం దావా కేసులో కేజ్రీవాల్ బుధవారం కోర్టుకు హాజరయ్యారు.

AAP Defamed: Kejriwal sent to Tihar jail, Nitin Gadkari smiles!

ఈ సందర్భంగా కోర్టుకు బెయిల్ బాండ్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు. ఆయనను అదుపులోకి తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఢిల్లీ న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. కేజ్రీవాల్‌కు ఈ నెల 23వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. అతనిని తీహార్ జైలుకు తరలించారు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/SCfoi5bhhNk?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిగా, ఏఏపి సమన్వయకర్తగా ఉన్న కేజ్రీవాల్ రెండు రోజుల జ్యూడిషియల్ కస్టడీ ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పెద్ద షాక్ అని చెప్పవచ్చు. తాను అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని, అలాంటప్పుడు తాను ఎలాంటి బెయిల్ అడగనని మెజిస్ట్రేట్ కోర్టుకు చెప్పారు.

డబ్బు సమస్య కాదు: ఎఎపి

కేజ్రీవాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకు్న అనంతరం ఏఏపి నేతలు మాట్లాడుతూ.. తమ పార్టీ అవినీతి పైన పోరాడం చేస్తుందని స్పష్టం చేశారు. తమకు ఇక్కడ డబ్బులు ప్రధానం కాదని, అవినీతిపై పోరాటమే ముఖ్యమన్నారు. తాము ఎలాంటి తప్పు చేయనందున బెయిల్ బాండ్ ఇవ్వలేదని చెప్పారు.

English summary
In a major setback for Aam Aadmi Party (AAP) convenor and former Delhi Chief Minister -- Arvind Kejriwal has been sent to judicial custody till May 23 in connection with defamation case involving BJP leader Nitin Gadkari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X