వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సల్మాన్‌గా ఫోజు పెట్టి న్యూడ్ ఫోటో అడిగాడు: నటి

By Pratap
|
Google Oneindia TeluguNews

 Actress receives indecent proposal on Facbook
ముంబై: తనను సల్మాన్ ఖాన్‌గా చెప్పుకుంటూ తనతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్‌లో సంభాషణ జరిపి ఓ గుర్తు తెలియని వ్యక్తి తన న్యూడ్ ఫొటో అడిగాడని ఓ నటి ముంబైలోని వన్రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ నటి ఓ డాక్యుమెంటరీలో నటించారు

ఆ వ్యక్తిని గుర్తించడానికి వెన్రాయ్ పోలీసులు ముంబై సైబర్ క్రైమ్ పోలీసుల సాయం కోరినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ మాదిరిగా సెప్టెంబర్‌లో తాను ఫేస్ బుక్కులో ఓ పేజీ చూశానని, సల్మాన్ ఖాన్ వ్యక్తిగత ఫొటోలు చాలా అప్‌లోడ్ అయ్యాయని, దాంతో తాను అది సల్మాన్ ఖాన్ అధికారిక పేజ్ అనుకున్నానని ఆమె వివరించారు.

సల్మాన్ ఖాన్ అనుకుని తాను మాట్లాడుతూ వచ్చానని, గుర్తు తెలియని వ్యక్తి తనను సల్మాన్ ఖాన్‌గా చెప్పుకుంటూ మాట్లాడాడని, గత సంబంధాల గురించి మాట్లాడాడని నటి మీడియా ప్రతినిధులతో చెప్పారు. వైబ్ పేజీకి లక్ష లైక్స్ వచ్చాయని, దాంతో అనుమానం రాలేదని అన్నారు.

ఈ నెలారంభంలో సంభాషణ జరుపుతుండగా ఇందులో ఏదో మాయ ఉందనినిపించిందని ఆమె చెప్పారు. అతను అసభ్యకరమైన భాష వాడుతూ వచ్చాడని, తన న్యూడ్ ఫోటోలను అడిగాడని, దాంతో అతను సల్మాన్ ఖాన్ కాదని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.

English summary
An actress who has worked in a critically acclaimed documentary complained to the Vanrai police on Friday after an unidentified person posing as actor Salman Khan interacted with her on a social networking site and later demanded her nude photographs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X