వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీని మెచ్చుకుంటున్న కాంగ్రెస్! లిస్ట్‌లో సింఘ్వీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపిస్తున్న కాంగ్రెసు నేతల్లో ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ కూడా చేరిపోయారు. మోడీ ఐక్యరాజ్య సమితి ప్రసంగంలో పాకిస్తాన్‌కు దీటుగా బదులిచ్చారని, కాంగ్రెస్ అధికార ప్రతినిధి శశిథరూర్ నిన్న ట్వీట్ చేశారు.

మంగళవారం అభిషేక్ సింఘ్వీ ప్రధానిని ప్రశంసల్లో ముంచెత్తారు. తాను ప్రధాని స్టేట్‌మెంట్‌తో పూర్తిగా ఏకీభవిస్తున్నానని, దీనిని ఎవరు కాదనలేరని తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. తీవ్రవాదానికి రంగు, షేడ్స్ లేవన్నారు. తీవ్రవాదాన్ని నిర్లక్ష్యం చేయవద్దన్నారు.

ఈ పర్యటనను మనం భారత్‌కు అనుకూలంగా మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ పర్యటన భారత్‌లో అభివృద్ధికి ఉపయోగపడితే మంచిదన్నారు. మాటలు, బ్రేక్ ఫాస్ట్ ద్వారానే మనం ఇప్పుడేమీ చెప్పలేమని, ఈ పర్యటన ద్వారా మంచి జరిగితే సంతోషమే అన్నారు.

అభిషేక్ సింఘ్వీ

అభిషేక్ సింఘ్వీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపిస్తున్న కాంగ్రెసు నేతల్లో ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ కూడా చేరిపోయారు.

శశిథరూర్

శశిథరూర్

మోడీ ఐక్యరాజ్య సమితి ప్రసంగంలో పాకిస్తాన్‌కు దీటుగా బదులిచ్చారని, కాంగ్రెస్ అధికార ప్రతినిధి శశిథరూర్ అన్నారు. ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

గులాం నబీ ఆజాద్

గులాం నబీ ఆజాద్

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాలు కాశ్మీర్ వరదల సమయంలో మోడీకి కితాబిచ్చారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మోడీకి అమెరికా ప్రభుత్వం, మీడియా కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి.

English summary

 Prime Minister Narendra Modi has not only won hearts of Indians living in US by his energetic speeches during his visit to the country, but back home, he has also earned the praise from his staunch opponents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X